Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉపాధ్యాయులు: విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు

Webdunia
శనివారం, 17 జులై 2021 (08:56 IST)
రాష్ట్రంలో ఉపాధ్యాయులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పరిగనిస్తూ కరోనా వాక్సిన్ ప్రక్రియలో ప్రాధాన్యత ఇస్తున్నామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యా రంగం లో ఉపాధ్యాయులు,అధ్యాపకులు,ప్రొఫెసర్లు,ఇతర సిబ్బంది కి కూడా ఈ నెల లో వాక్సిన్ వేయడానికి ఇప్పటికే ప్రజారోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు. ఇప్పటికే అందరు అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడి దీనిపై సూచనలు చేశామన్నారు.

కళాశాలల ప్రాంతీయ  విద్యాధికారులు, పాఠశాల ప్రాంతీయ విద్యా సంచాలకులు, జిల్లా విద్యా శాఖ అధికారులు, విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్లు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్లు ఈ మేరకు సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్లు (అభివృద్ధి), జిల్లా వైద్యాశాఖధికారులతో  సంప్రదించి సమన్వయం చేసుకోవాలని ఆదేశించినట్లు మంత్రి సురేష్ తెలిపారు.

\అన్ని జిల్లాల్లో ఉపాధ్యాయులకు జరుగుతున్న వాక్సిన్ ప్రక్రియపై ఎప్పటికప్పుడు మంత్రి పేషీకి సమాచారం ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments