హోమ్ వర్క్ చేయలేదని విద్యార్థిని చితక్కొట్టిన టీచర్.. ఎక్కడ? (video)

సెల్వి
శుక్రవారం, 18 అక్టోబరు 2024 (14:33 IST)
Teacher
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గొల్లగూడెంలోని మానస వికాస్ పాఠశాలలో హోమ్ వర్క్ చేయలేదని ఓ ఉపాధ్యాయుడు విద్యార్థి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. ఈనెల 16న ఆరో తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుడు సతీశ్ హోమ్ వర్క్ ఇచ్చారు. 
 
అయితే ఓ విద్యార్థి మాత్రం హోమ్ వర్క్ చేయలేదు. అదే విషయాన్ని బాలుడు ఉపాధ్యాయుడికి చెప్పాడు. దీంతో కోపోద్రిక్తుడైన టీచర్ తాను చెప్పిన పని ఎందుకు చేయలేదంటూ చిన్నారిని బెత్తంతో తీవ్రంగా కొట్టాడు. అది చాలదన్నట్లు చేతులతో పిడిగుద్దులు కురిపించాడు. 
 
కసి తీసే వరకూ తీవ్రంగా కొట్టాడు. దీంతో కోపోద్రిక్తుడైన టీచర్ తాను చెప్పిన పని ఎందుకు చేయలేదంటూ చిన్నారిని బెత్తంతో తీవ్రంగా కొట్టాడు. అది చాలదన్నట్లు చేతులతో పిడిగుద్దులు కురిపించాడు. కసి తీసే వరకూ తీవ్రంగా కొట్టాడు. 
 
దీనికి సంబంధించిన దృశ్యాలు తరగతి గదిలోని సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయ్యాయి. అయితే బాలుడి తల్లి అతనికి స్నానం చేయించేందుకు బట్టలు తీసింది. ఒంటి నిండా గాయాలు ఉండడంతో ఆమె ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయ్యింది. ఈ విషయాన్ని వెంటనే భర్తకు చెప్పింది. 
 
ఇద్దరూ కలిసి కుమారుడిని ప్రశ్నించగా.. ఉపాధ్యాయుడు దాడి చేయడం గురించి వివరించాడు. ఆపై సీసీటీవీ రికార్డులతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి విచారణ జరిపి ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments