భారతీయులకు రికార్డు స్థాయిలో అమెరికా వీసాలు మంజూరు చేసింది. 2023లో 1.4 లక్షల మందికి వీసాలు మంజూరు చేయగా, తాజాగా ఈ సంఖ్యను రెట్టింపు చేసింది. ఇతర దేశాల విద్యార్థులతో పోల్చుకుంటే భారతీయ విద్యార్థులకే తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు అగ్రరాజ్యం అమెరికా తన చర్యల ద్వారా చెప్పకనే చెప్పింది.
భారతీయ విద్యార్థులకు వరుసగా నాలుగో యేడాది కూడా అమెరికా రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు మంజూరు చేసిందని భారతీయ దౌత్య వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఎన్ని వీసాలు జారీ చేసిందన్నదానిపై ఖచ్చితమైన సంఖ్య తెలియనప్పటికీ 2023లో మాత్రం 1.4 లక్షలకుపైగా వీసాలు జారీచేసివుంటుందని భావిస్తున్నారు.
దీనిపై భారత్‌లో అమెరికా దౌత్యకార్యాలయ వర్గాలు స్పందిస్తూ, ఈ వేసవి కాలంలో రికార్డు స్థాయిలో వీసా దరఖాస్తులను పరిశీలించామని, దరఖాస్తుదారులందరూ తొలిసారిగా అమెరికా వెళుతున్నావారేనని పేర్కొన్నాయి.
కాగా, భారతీయ విద్యార్థుల నుంచి అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో అమెరికా కొత్తగా 2.5 లక్షల వీసా అపాయింట్‌మెంట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ అపాయింట్మెంట్ స్లాట్లను విడుదల చేయడం వల్ల భారతీయ విద్యార్థులు తగిన వ్యవధిలో ఇంటర్వ్యూలు పూర్తి చేసేందుకు వెసులుబాటు కలుగుతుందని అమెరికా ఎంబసీ వెల్లడించింది.