Webdunia - Bharat's app for daily news and videos

Install App

7న టీడీపీ నిరసన కార్యక్రమాలు: చంద్రబాబు

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (10:29 IST)
రాష్ట్రంలో 80 నియోజకవర్గాల్లో మైనింగ్ మాఫియా జరుగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలపై 7వ తేదీ నిరసన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

జగన్&కో అవినీతి, దుబారాలే నేటి ఆర్థిక సంక్షోభానికి కారణమన్నారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు సంబంధించి ఎక్కడా తట్ట మట్టి పోయలేదన్నారు.

రోడ్డు సెస్ రూ.1200 కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. దారిమళ్లించిన నిధులను తిరిగి ఇచ్చి వెంటనే రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. 
 
రెండేళ్లయినా ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల చెల్లింపులు చేయకపోవడం కోర్టు ధిక్కరణ చర్య అన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

సమస్యను పక్కదారి పట్టించడానికి కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి పాలనలో దళితులపై దాడులు పెరిగాయన్నారు. హోంమంత్రి డమ్మీ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తున్నారని పేర్కొన్నారు. ఏపీఎస్ డీసీ ద్వారా అప్పులు తీసుకువచ్చి ఉద్దేశపూర్వకంగా మోసం చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments