Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధనవంతుల అభ్యున్నతి కోసం ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు: సజ్జల

ధనవంతుల అభ్యున్నతి కోసం ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు: సజ్జల
, బుధవారం, 28 జులై 2021 (03:33 IST)
పార్టీ స్ర్టక్చర్,పార్టీ నేతలు,ప్రజాప్రతినిధులు అని కాకుండా డైరక్ట్ గా ప్రజలకే పధకాలను చేరేవేసే ప్రక్రియను ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేపట్టారని ఇది ఒక రకంగా రిస్కీ గేమ్ అయినా, రాష్ర్టంలో అన్ని వర్గాల సమగ్రాభివృధ్దే ధ్యేయంగా ఆయన ముందుకు వెళ్తున్నారని దీనికి ప్రజలందరూ వైయస్ జగన్ కు మధ్దతుగా నిలుస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.

తాడేపల్లిలోని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో దేవాంగ కుల రాష్ట్ర స్ధాయి నేతల సమావేశం దేవాంగ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ బీరక సురేందర్‌ బాబు అధ్యక్షతనజరిగింది.సమావేశంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక బిసి,ఎస్సి,ఎస్టి,మైనారిటీ అగ్రవర్ణాలలోని పేదలకు పార్టీ రహితంగా సంక్షేమ పధకాలను అందిస్తున్నారన్నారు.

దాదాపు లక్ష కోట్ల రూపాయలకు పైగా ఆయా వర్గాల ప్రజల అకౌంట్లలోకి నేరుగా వెళ్లాయన్నారు.ఇది కరోనా వంటి సంక్షోభసమయంలో ప్రజలకు ఎంతో మేలు చేసిందని ఆర్ధికవేత్తలు సైతం చెబుతున్నారని అన్నారు.ఇదే తెలుగుదేశం పార్టీ పాలనలో అన్నీ కూడా జన్మభూమి కమిటీల ద్వారా అందించి కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఇది ప్రజలందరు గ్రహించారు కాబట్టే చంద్రబాబుకు ఎన్నికలలో తగిన బుధ్ది చెప్పారన్నారు.

దేవాంగులకోసం వైయస్ జగన్ అనేక పధకాలు ప్రవేశపెడుతున్నారని అవి ఆ కులంలో ప్రతి ఒక్కరికి చేరేలా దేవాంగ కార్పోరేషన్ లో పదవులు చేపట్టిన వారు కృషి చేయాలని కోరారు. పేదరిక నిర్మూలనకు దేశ చరిత్రలోనే కూడు,గుడ్డ,గూడు మాత్రమే చాలవని విద్య,వైద్యం కూడా అత్యంత ఆవశ్యకమని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి వైయస్ రాజశేఖరరెడ్డి అని అన్నారు.

అందుకే ఆయన ఆరోగ్యశ్రీ,ఫీజు రీయంబర్స్ మెంట్ ప్రవేశపెట్టారని తెలియచేశారు.ఆయన తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వాటిని నిర్లక్ష్యం చేశారని అన్నారు.చంద్రబాబు వాటిని నిర్వీర్యం చేయడంలో విశ్వరూపం ప్రదర్శించారని విమర్శించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షర్మిళకు పూర్తి మ‌ద్ద‌తు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి