Webdunia - Bharat's app for daily news and videos

Install App

భ‌ద్రాచ‌ల సీతారాముడిని ద‌ర్శించుకున్ననారా లోకేష్‌

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (15:32 IST)
పోల‌వరం నిర్వాసిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించేందుకు వెళ్తోన్న టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ మంగ‌ళ‌వారం భ‌ద్రాచ‌లంలో సీతారామ‌చంద్ర‌మూర్తిని ద‌ర్శించుకున్నారు. అనంత‌రం ప‌ర్య‌ట‌న‌కి బ‌య‌లుదేరే స‌మ‌యంలో ప‌ల‌క‌రించిన మీడియా ప్ర‌తినిధులతో మాట్లాడారు.

రాజ‌కీయాల గురించి ప్ర‌శ్న‌లు అడిగితే..``దైవ‌ద‌ర్శ‌నం చేసుకుని వ‌చ్చాను, రాజ‌కీయాలు మాట్లాడ‌ను`` అంటూ సున్నితంగా తిర‌స్క‌రించారు. స్వామికి ఏమ‌ని మొక్కుకున్నార‌ని అడ‌గ్గా... ``క‌రోనా థ‌ర్డ్ వేవ్ హెచ్చ‌రిక‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో, క‌రోనా క‌ష్టాలు క‌డ‌తేరాల‌ని, ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యాల‌తో వుండాల‌ని, తెలుగు రాష్ట్రాలు స‌ఖ్య‌త‌తో ఉండి ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాలు గౌర‌వించుకుని, ప్ర‌గ‌తిప‌థంలో సాగాలి`` అని ప్రార్థించిన‌ట్టు తెలిపారు.
 
 పోల‌వ‌రం నిర్వాసితుల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాల‌ని సీతారామ‌చంద్ర‌మూర్తికి మొక్కుకున్నాన‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌-తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య భ‌ద్రాచ‌లం కేంద్రంగా స‌మ‌స్య‌గా వున్న 5 పంచాయ‌తీల గురించి మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నించారు. ఇరురాష్ట్రాల ముఖ్య‌మంత్రులు మంచి స్నేహితులు అనీ,  వారు అనుకుంటే క్ష‌ణాల్లో ఈ స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని స‌మాధానం ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నయనతారను పట్టించుకోని ఢిల్లీ జనం.. విఘ్నేశ్ వీడియో వైరల్

కార్తీక్‌ దండు దర్శకత్వంలో పర్వతంపై నిలబడ్డ నాగ చైతన్య 24 సినిమా పోస్టర్

స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ దేశం గర్వించే స్థాయికి ఎదుగుతుంది: ఎస్ఎస్ రాజ‌మౌళి

జానీ మాస్టర్‌కు ఊరట.. బెయిల్ రద్దు పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీం

నాగ చైతన్యకు పవర్ ప్యాక్డ్ పోస్టర్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తండేల్ బృందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments