Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీగారు.. మీకు మూడిందా? : కోయదొర వేషంలో ఎంపీ శివప్రసాద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదాను కేటాయించాలని కోరుతూ పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీలు గతవారం రోజులుగా వివిధ రకాలుగా ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా, చిత్తూరు ఎంపీ డాక్టర్ ఎన్.

Webdunia
శుక్రవారం, 9 మార్చి 2018 (13:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదాను కేటాయించాలని కోరుతూ పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీలు గతవారం రోజులుగా వివిధ రకాలుగా ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా, చిత్తూరు ఎంపీ డాక్టర్ ఎన్. శివప్రసాద్ రోజుకో వేషంలో పార్లమెంట్‌కు వచ్చి తన నిరసనను తెలుపుతున్నారు.
 
ఇందులోభాగంగా, ఆయన శుక్రవారం కోయదొర వేషంలో పార్లమెంట్‌కు వచ్చారు. కొండదేవర తరహాలో మాట్లాడుతూ, పార్లమెంటులో కలియదిరిగారు. మధ్యలో, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ చేయి చూసి జాతకం కూడా చెప్పారు.
 
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 'బెజవాడ కనకదుర్గమ్మ మీద ఆన... తిరుపతి ఎంకన్న మీద ఆన.. జరిగింది చెబుతాను.. జరగబోయేది చెబుతాను.. ఆ నాడు ఇందిరకు చెప్పాను.. ఎన్టీఆర్‌తో పెట్టుకోవద్దని.. పెట్టుకుంటే ఏం జరిగిందో తెలుసు కదా.
 
ఈనాడు మోడీకి చెబుతున్నాను... ఏపీతో సఖ్యంగా ఉండటం ఇష్టం లేదా.. మీకు మూడిందా ఏంది... తెలుగు ప్రజల ఆత్మగౌరవ నాడి తెలియలేదా ఏంది.. ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు నీవు.. ఏపీని ఏం చేయాలనుకుంటున్నావు నీవు' అంటూ కోయదొర మాదిరి మాట్లాడారు. మా మాట వింటే హుర్రో హుర్రు.. లేకపోతే పుర్రో పుర్రు అంటూ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments