టీడీపీ ఎంపీలకు జాక్‌పాట్... పెద్దపీట వేస్తున్న కేంద్రం!!

వరుణ్
మంగళవారం, 6 ఆగస్టు 2024 (12:39 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలకు జాక్‌పాట్ తగిలింది. పార్లమెంట్ కీలక కమిటీల్లో ఆ పార్టీకి చెందిన ఎంపీలకు భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేస్తుంది. అనేకమంది ఎంపీలకు పార్లమెంట్ కీలక కమిటీల్లో చోటుకల్పిస్తుంది. కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా ఉంది. ఈ ప్రభుత్వంలో ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. తాజాగా ఐదుగురు ఎంపీలకు పార్లమెంట్‌కు చెందిన వివిధ కీలక కమిటీల్లో చోటుదక్కింది. 
 
పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అంచనాల కమిటీలో పార్థసారథి, ఓబీసీ కమిటీలో జి.లక్ష్మీనారాయణ, ఎస్సీ, ఎస్టీ కమిటీలో కృష్ణప్రసాద్ స్థానం దక్కించుకున్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి హౌసింగ్ కమిటీలోనూ సభ్యుడుగా ఉన్నారు. అలాగే, టీడీపీకి ఒక మంత్రిత్వ స్థాయి సంఘం చైర్మన పదవి కూడా లభించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. 
 
ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీయే సర్కారు మనుగడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌లపై ఆధారపడివున్న విషయం తెల్సిందే. దీంతో ఈ ఇద్దరు నేతలు రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలను పట్టుబట్టి సాధించుకునే పరిస్థితి ఉందని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments