Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమ్మ కులాన్ని పట్టించుకోని చంద్రబాబు : ఎంపీ రాయపాటి ఫైర్

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కమ్మ కులాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదని, గ్రామ స్థాయిలో పార్టీ కోసం పని చేసిన క్యాడర్ చాలా నిర

Webdunia
ఆదివారం, 5 మార్చి 2017 (13:31 IST)
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కమ్మ కులాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదని, గ్రామ స్థాయిలో పార్టీ కోసం పని చేసిన క్యాడర్ చాలా నిరుత్సాహంగా ఉన్నారని, ఇది పార్టీ మనుగడకు మంచిది కాదని హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడే వారిని చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
 
గుంటూరులోని కమ్మ జన సేవా సమితిలో కాకతీయ కన్వెన్షన్ కమిటీ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయపాటి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో తాను చాలా జూనియర్‌ని అని, అందుకే, చంద్రబాబును గట్టిగా ప్రశ్నించలేకపోతున్నట్టు చెప్పారు. ఇకపై ప్రత్యక్ష ఎన్నికలలో తాను పోటీ చేయనని, తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని రాయపాటి స్పష్టం చేశారు. 
 
చంద్రబాబు కమ్మ కులాన్ని పట్టించుకోవడం లేదని రాయపాటి ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసే వారిని, పార్టీని నిలబెట్టేవారిని చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం... తన పదవి కోసం చంద్రబాబు ఓ కులానికి కొమ్ము కాస్తున్నాడని పరోక్షంగా మరో అగ్ర కులానికి చెందిన టీడీపీ నేతలకు ఆయన చురకలంటించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments