టీడీపీ ఎంపీకి కేంద్రం బంపర్ ఆఫర్... ఆపరేషన్ కమలంలో భాగమేనా?

Webdunia
గురువారం, 11 జులై 2019 (15:19 IST)
తెలుగు రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులకు కీలక పదవులు కట్టబెట్టింది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంట్లో ఎస్టిమేట్ కమిటీ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఎంపీలకు కేంద్రం అవకాశం ఇచ్చింది. అందులో భాగంగా ఉత్తర్వులు సైతం జారీ చేసింది. 
 
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నానిలకు ఎస్టిమేట్ కమిటీలో సభ్యత్వం కల్పించింది. ఎస్టిమేట్ కమిటీ సభ్యుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 29 మంది ఎంపీలకు అవకాశం కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే వారిలో ఇద్దరు ఏపీకి చెందిన ఎంపీలు కావడం విశేషం. 
 
అయితే ఇప్పటివరకు కేంద్రం ఆఫర్ చేసిన పదవులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరస్కరిస్తూ వస్తోంది. కీలకమైన డిప్యూటీ స్పీకర్ పోస్టును సైతం ప్రత్యేక హోదా కోసం వదులుకుంది. అనంతరం రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని ప్యానల్ లోక్‌సభ స్పీకర్‌గా నియమించింది. 
 
ఆ నియామకాన్ని వైసీపీ స్వాగతించింది. ఇప్పటికే మిథున్ రెడ్డి ప్యానల్ స్పీకర్‌గా స్పీకర్ స్థానంలో భాధ్యతలు సైతం నిర్వర్తించారు. తాజాగా ఎస్టిమేట్ కమిటీ సభ్యులుగా మాగుంట శ్రీనివాసుల రెడ్డిని నియమించింది కేంద్రం. మాగుంటకు పదవి కట్టబెట్టడంపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి. 
 
అయితే, టీడీపీకి చెందిన ఎంపీకి ఇక్కడ చోటు కల్పించడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటీవలే టీడీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. అలాగే, టీడీపీకి చెందిన ఎంపీ కేశినేని నానిని తమవైపునకు తిప్పుకోవడంలో భాగంగానే కీలక పదవిని కట్టబెట్టినట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments