Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పెషల్ స్టేటస్ కంటే ప్యాకేజీ వల్లే రాష్ట్రానికి మేలు: టీడీపీ ఎమ్మెల్సీ బీదా

ఏపీకి స్పెషల్ స్టేటస్ కంటే ప్రత్యేక ప్యాకేజీ వల్లే రాష్ట్రానికి మేలు జరుగుతుందని టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పేర్కొన్నారు. దేశంలోని 11 రాష్ట్రాల్లో 15 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా ఉందని.. కానీ ఆ రాష్

Webdunia
ఆదివారం, 29 జనవరి 2017 (16:14 IST)
ఏపీకి స్పెషల్ స్టేటస్ కంటే ప్రత్యేక ప్యాకేజీ వల్లే రాష్ట్రానికి మేలు జరుగుతుందని టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పేర్కొన్నారు. దేశంలోని 11 రాష్ట్రాల్లో 15 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా ఉందని.. కానీ ఆ రాష్ట్రాలు ఇప్పటిదాకా అభివృద్ధి సాధించింది లేదన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించి పెట్టుబడులు రాకుండా చేయాలని ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తున్నారని రవిచంద్ర పేర్కొన్నారు.
 
ఇదిలా ఉంటే..  రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల నష్టపోయిందని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన జరిగిన ఎంపీల భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మిగిలిన రాష్ట్రాలతోపాటు సమానంగా అభివృద్ధి చేయాలంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. 
 
రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఆనాడు అప్పటి ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం నాయకులు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రత్యేక హోదాను తుంగలో తొక్కారని మేకపాటి మండిపడ్డారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు ఏపీ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని వైసీపీ ఎంపీలు విమర్శించారు. పార్లమెంట్‌లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడతామని స్పష్టం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments