Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ల వెంటపడేందుకే తెలుగు హీరోలు సరిపోతారట... నిజమా?

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలపై అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. మన తెలుగు హీరోలంతా కేవలం హీరోయిన్ల వెంటపడేందుకు మాత్రమే సరిపోతారంటూ ఘాటైన వ్

Webdunia
మంగళవారం, 20 మార్చి 2018 (14:39 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలపై అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. మన తెలుగు హీరోలంతా కేవలం హీరోయిన్ల వెంటపడేందుకు మాత్రమే సరిపోతారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ నేత ఎవరో కాదు.. యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్. ఏపీ శాసనమండలి సభ్యుడు. 
 
ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, ఏజీ బార్ అయిన హీరోలూ... మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? అంటూ తీవ్ర విమర్శలు చేశారు. మీది హాలీవుడ్ స్థాయి కాదని... హీరోయిన్ వెంటపడే క్యారెక్టర్లకే మీరు పనికొస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ప్రత్యేక హోదా కోసం పోరాడకుంటే... ఏపీ ప్రజలు మిమ్మల్ని వెలివేసేస్తారంటూ హెచ్చరించారు. 
 
జల్లికట్టు కోసం తమిళ చిత్ర పరిశ్రమ ఏకమై పోరాడిందని ఆయన గుర్తుచేశారు. కనీసం తమిళ హీరోలను చూసైనా నేర్చుకోవాలని హితవు పలికారు. విభజన తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు విభజన హామీ మేరకు ఇస్తానన్న ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఒక్క హీరో కూడా ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. 
 
ఎవరికైనా అవార్డు రాకపోతే రచ్చ రచ్చ చేస్తారని... భూమి, ఆకాశాలు బద్దలైనట్టు వ్యవహరిస్తారని... ఇంటర్వ్యూలపై ఇంటర్వ్యూలు ఇస్తారని... ఇక్కడ మా ఆంధ్ర ప్రజలకు రివార్డులు రావడం లేదయ్యా... నిధులు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామయ్యా... మీ కళ్లకు కనబడటం లేదా? ఏసీ రూముల్లో కులుకుతూ కూర్చుంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. సంస్కారం అడ్డొస్తోందని.. లేకపోతే ఇంకా కఠినంగా మాట్లాడేవాడినని అంటూ తన విలేకరుల సమావేశానికి ముగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గేమ్ ఛేంజర్ లో దర్శకుడు శంకర్ ఎక్కుపెట్టిన అస్త్రం హైలైట్ ?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments