అయ్య బాబోయ్.. అమిత్ షా ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వలేదంటే నమ్మరే : వీర్రాజు
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అవినీతి ఆరోపణలు చేసినందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు మీడియాలో వచ్చిన వార్తలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అవినీతి ఆరోపణలు చేసినందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు మీడియాలో వచ్చిన వార్తలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందించారు. అమ్మతోడుగా, తమ పార్టీ అధినేత అమిత్ షా ఫోన్ చేసి హెచ్చరించలేదని స్పష్టంచేశారు.
ఇదే అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, షా తనను మందలించారని వస్తున్న వార్తల్లో రవ్వంత కూడా వాస్తవం లేదన్నారు. కావాలంటే తన కాల్‌డేటా చెక్ చేసుకోవచ్చన్నారు. తన గొంతును నొక్కే ప్రయత్నం జరుగుతోందన్నారు. తనను వైసీపీ కోవర్టు అంటూ చేస్తున్న ఆరోపణలు వింటుంటే నవ్వొస్తోందని చెప్పారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని ఏపీ హక్కుల కోసం జేఏసీని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేపట్టడం మంచిదేనన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అనిశ్చిత వాతావరణం నెలకొందని దానికి చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు.