Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి బ్లాంక్ జీవోలు ఆపించండి.. గవర్నర్‌కు టీడీపీ నేతల వినతి

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (15:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ హరిచందన్‌ను టీడీపీ సీనియర్ నేతలు వర్ల రామయ్య, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌‌లు శుక్రవారం కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన బ్లాంక్‌, రహస్య జీవోల వ్యవహారంపై గవర్నర్‌కు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. 
 
అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్‌ నేతృత్వంలో అర్ధరాత్రి బ్లాంక్‌ జీవోలు జారీ చేస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. 12 రోజుల్లో 50 బ్లాంక్‌ జీవోలు ఇచ్చారని.. వాటిలో తేదీ, జీవో నంబర్‌ మాత్రమే ఉంటోందన్నారు. పారదర్శక పాలన ఎందుకు చేయలేకపోతున్నారని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.
 
బ్లాంక్‌ జీవోలను చూపితే గవర్నర్‌ ఆశ్చర్యపోయారన్నారు. ఇకనైనా అర్థరాత్రి బ్లాంక్‌ జీవోలు జారీ చేయడాన్ని మానుకోవాలని వర్ల రామయ్య హితవు పలికారు. జీవోలు గవర్నర్ పేరుతో జారీ చేస్తారని.. ఈ విషయంలో ఆయన కూడా బాధ్యత వహించాలని గద్దె రామ్మోహన్‌ కోరారు. దీనిపై విచారణ చేయించాలని ఆయన డిమాండ్‌ చేశారు.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments