పోలీస్ రౌడీయిజం.. ఠాణా భవనం నుంచి దూకేసిన మాజీ సర్పంచ్

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (19:18 IST)
శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు తమ లాఠీ పవర్ చూపించారు. వారు పెట్టిన వేధింపులు తాళలేని ఓ మాజీ సర్పంచ్ పోలీస్ స్టేషన్ భవనం నుంచి దూకేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈయన జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ కుమారుడు కావడం గమనార్హం. శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీకాకుళం జిల్లా షేర్ మహమ్మదాపురం మాజీ సర్పంచ్ అవినాశ్ చౌదరి. షేర్ మహమ్మదాపురంలోని శివాలయం విషయంలో ఇరు వర్గాల మధ్య ఈ వివాదం తలెత్తింది. ఈ వివాదం కాస్తా పోలీస్ స్టేషన్ వరకు చేరింది. దీంతో ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ ఖాకీలు అవినాశ్‌ను వేధించసాగారు. 
 
ఈ వేధింపులు తాళలేని అవినాశ్... స్టేషన్ భవనంపై నుంచి కిందికి దూకేశాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో, ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల మధ్య వివాదం నేపథ్యంలో ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆయన పోలీస్ స్టేషన్‌పైకి ఎక్కారు. ఆయనను అడ్డుకోవడానికి ఒక వ్యక్తి రాగా... వెంటనే ఆయన పై నుంచి దూకేశారు. ఇది స్థానికంగా కలకలం సృష్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments