Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడాలి నాని నోరు అదుపులో ఉంచుకో.. లేకుంటే ఖబడ్దార్

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (14:05 IST)
ఏపీ మంత్రి కొడాలి నానికి టీడీపీ మహిళా నేత, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అని వార్నింగ్ ఇచ్చారు. కొడాలి నాని నోరు అదుపులో ఉంచుకోవాలంటూ హెచ్చరించారు. టీవీల్లో మంత్రి కొడాలినాని ప్రెస్‌మీట్‌ వస్తే చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో చానళ్లు మారుస్తున్నారని గుర్తుచేశారు. 

ఆయన వాడుతున్న భాషేంటి, మాట్లాడుతున్న మాటలు ఏంటి? అమరావతికి అంతర్జాతీయంగా చంద్రబాబు ఒక బ్రాండింగ్‌ ఇమేజ్‌ తీసుకువస్తే దానికి బీటలు వార్చింది జగన్‌ కాదా? చంద్రబాబు పాలనలో నిరంతరం పనులు జరుగుతూ కార్మికులతో కలకళలాడిన రాజధాని ప్రాంతాన్ని 6 నెలల్లోనే అడవిలా మార్చింది జగన్‌ కాదా? అంటూ మండిపడ్డారు.
 
జగన్‌ అమరావతిని నిర్లక్ష్యం చేస్తుంటే కొడాలినాని ఏం చేస్తున్నారు. గుడ్డిగుర్రానికి పళ్లు తోమున్నారా? అమరావతిలో కుక్కలు, పందులు తిరుగుతున్నాయని ఆయన అంటున్నారు. కానీ ఆయనే రోజుకోసారి సచివాలయానికి వెళ్లివస్తున్నారు. మరి ఆయన ఏంటి? రాజధానిలో ఐదేళ్లు చంద్రబాబు ఏం చేశారని అంటున్నారు. ఐదేళ్లలో సగం సమయం రాజధానిని అడ్డుకునేందుకు వైసీపీ చేసిన కుట్రలు, వేసిన కేసులను ఎదుర్కోవడానికి సరిపోయిందని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments