Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పాడ తీరంలో సముద్రం ఉగ్రరూపం : పిఠాపురం మాజీ ఎమ్మెల్యే జస్ట్ మిస్

ఠాగూర్
శుక్రవారం, 12 సెప్టెంబరు 2025 (20:54 IST)
కాకినాడు జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. దీంతో కాకినాడ - ఉప్పాడ బీచ్ రోడ్డు బాగా దెబ్బతింది. దీన్ని పరిశీలించేందుకు వెళ్లిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. తీరం రహదారిపై నడుచుకుంటూ వస్తుండగా, ఒక్కసారిగా రాక్షస అల ఒకటి ఉవ్వెత్తున ఎగిసిపడి, అలలు చుట్టుముట్టాయి. దీంతో అక్కడున్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 
 
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉప్పాడ తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. దీని ప్రభావంతో ఉప్పాడ - కాకినాడ బీచ్ రోడ్డు తీవ్రంగా దెబ్బతింది. భారీ కెరటాల తాకిడికి రోడ్డు కోతకు గురై పూర్తిగా ధ్వంసమైంది. ఈ పరిస్థితిని పరిశీలించడానికి వర్మ అక్కడికి వెళ్ళారు. ఆయన పరిస్థితిని అంచనా వేస్తుండగా ఓ భారీ కెరటం ఒక్కసారిగా దూసుకొచ్చి ఆయన్ను చుట్టుముట్టింది. దీంతో అప్రమత్తమైన ఆయన వెంటనే వెనక్కి జరిగి సురక్షితంగా బయటపడ్డారు. 
 
అనంతరం ఆయన కొత్తపట్నం గ్రామానికి వెళ్ళి సముద్రపు నీటితో నష్టపోయిన జాలర్లతో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి వర్మ మాట్లాడుతూ, ప్రభుత్వం మీకు అన్ని విధాలా అండగా ఉంటుంది. ఈ సమస్యలకు త్వరలోనే పరిష్కారం కల్పిస్తాం అంటూ భరోసా ఇచ్చారు. మరోవైపు, అధికారులు ముందు జాగ్రత్త చర్యగా బీచ్ రోడ్డుపై రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అలల ఉధృతి తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya: లావణ్య త్రిపాఠి కి అభినందనలు - అథర్వ మురళి టన్నెల్ మూవీ వాయిదా

లిటిల్ హార్ట్స్ మూవీకి సపోర్ట్ చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్న స్టార్స్

ఏడాదిలో మరింత వినోదాన్ని, అనుభూతిని ఇచ్చేందుకు రెడీగా సోనీ లివ్

మిరాయ్ సినిమాలో బ్లాక్ స్వార్డ్ క్యారెక్టర్ లో ఆకట్టుకుంటున్న మంచు మనోజ్

కిష్కింధపురి జెన్యూన్ రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Milk: జుట్టు ఆరోగ్యానిరి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

తర్వాతి కథనం
Show comments