Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఫోను లాక్కున్న తిరుపతి పోలీసులు...

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (12:45 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరులోని గాంధీ విగ్రహ కూడలి వద్ద నిరసన తెలిపేందుకు సోమవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో చిత్తూరు జిల్లా కేంద్రానికి చేరుకోవాల్సి వుంది. కానీ, చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనన్ను వెనక్కి వెళ్లాల‌ని కోరుతున్నారు. 
 
దీంతో పోలీసుల‌పై చంద్ర‌బాబు నాయుడు మండిప‌డ్డారు. చంద్ర‌బాబుతో పాటు పీఏ, వైద్యాధికారి ఫోన్ల‌ను పోలీసులు లాక్కున్నారు. తాను క‌లెక్ట‌రుతో పాటు, తిరుప‌తి, చిత్తూరు ఎస్పీల‌ను క‌లిసి, త‌న ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకోవ‌డంపై విన‌తి ప‌త్రం ఇస్తాన‌ని పోలీసుల‌కు చంద్ర‌బాబు నాయుడు చెప్పారు.
 
అధికారుల‌ను క‌లిసేందుకు కూడా పోలీసులు అనుమతిని నిరాక‌రించారు. దీంతో అనుమ‌తి ఇవ్వాల్సిందేన‌ని చంద్ర‌బాబు నాయుడు ప‌ట్టుబ‌ట్టారు. అనుమ‌తి ఇచ్చేవ‌ర‌కు తాను బైఠాయించిన ప్రాంతం నుంచి క‌ద‌ల‌బోనంటూ పోలీసుల‌కు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఓ ప్ర‌తిప‌క్ష నేత‌గా క‌లెక్ట‌ర్, ఎస్పీల‌ను క‌లిసే హ‌క్కు కూడా త‌న‌కు లేదా? అంటూ మండిప‌డ్డారు.
 
ఇదిలావుంటే, చిత్తూరులోని గాంధీ విగ్రహ కూడలిలో నేడు టీడీపీ నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 5 వేల మంది కార్యకర్తలు పాల్గొననున్నారు. ఈ నిరసన కార్యక్రమానికి టీడీపీ నేతలు పోలీసుల అనుమతి కోరారు.
 
అయితే, గత రాత్రి 11.30 గంటల సమయంలో అనుమతి నిరాకరిస్తూ చిత్తూరు పోలీసులు ఉత్తర్వులు ఇచ్చారు. కొవిడ్ నేపథ్యంలో అంతమందితో కార్యక్రమ నిర్వహణకు అనుమతి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. అలాగే, మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉందని, కాబట్టి అనుమతి ఇచ్చేది లేదని డీఎస్పీ స్పష్టం చేశారు.  
 
మరోవైపు, కార్యక్రమంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు బయలుదేరారు. 9. 45 గంటలకు ఆయన రేణిగుంట చేరుకుంటారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లాలోని పలువురు టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
 
పలమనేరులో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, తిరుపతిలో టీడీపీ నేత నర్సింహయాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులను పోలీసులు నిర్బంధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments