Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతలవి రోడ్లు వేసే మొహాలేనా? టీడీపీ చీఫ్ చంద్రబాబు

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (14:42 IST)
వైకాపా నేతలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూల్చివేతతో పరిపాలన ప్రారంభించన వైఎస్ జగన్ పాలన విధ్వంసంగానే సాగుతోందన్నారు. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో గృహాలను కూల్చిచేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రోడ్డు వేసే మొహాలు ఇవేనా అంటూ సెటైర్ వేశారు. 
 
ఈ వైకాపా ప్రభుత్వానికి పోయేకాలం దాపురించిందన్నారు. శిశుపాలుడిలా జగన్ రెడ్డివి వంద తప్పులు దాటాయని, ఇగ మిగిలింది ప్రభుత్వ పతనమేనని ఆయన జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అరెస్టులు, అహంకారం, అడ్డగింతలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. సీఎం అధికార దాహానికి, అహంకారానికి జవాబు చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 
 
కేవలం 600 ఇల్లు ఉన్న ఇప్పటం గ్రామంలో 120 అడుగుల రహదారి వేస్తారా అని నిలదీశారు. ఇది కక్ష సాధింపు కాకుంటే మరేంటని ఆయన ప్రశ్నించారు. "ఇప్పటం గ్రామానికి వెళుతున్న పవన్ కళ్యాణ్‌ను అడ్డుకునే, చీకట్లో తన రోడ్‌షోలో రాళ్లు రువ్వితోనే మీరు సాధించబోయేది ఏమీ లేదని చంద్రబాబు అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments