Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్టీఆర్ వెన్నుపోటు..ఆ ఆరుగురు మహిళలే కారణం.. వెంకయ్య

Advertiesment
venkaiah naidu
, శనివారం, 5 నవంబరు 2022 (12:08 IST)
కృష్ణా జిల్లా పెనమలూరులో మన గ్రామం సహజ ఉత్పత్తులు కేంద్రాన్ని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సందర్శించారు. అనంతరం ఎన్టీఆర్ గద్దె దిగడానికి కొన్ని నెలల ముందు సీనియర్ ఎన్టీఆర్‌ను కలిశానని వెంకయ్యనాయుడు అన్నారు. అప్పుడు కొందరు మహిళలు ఆయనను కలిశారన్నారు. ఆ సమయంలో వాళ్లు ఆయన కాళ్లు మొక్కారని చెప్పుకొచ్చారు. 
 
వాళ్లు అలా ఎందుకు చేస్తున్నారని తాను ఎన్టీఆర్‌ను అడిగానని.. అందుకు ఆయన అదంతా వారి ప్రేమ, అభిమానం అని సమాధానం ఇచ్చారని వెంకయ్య చెప్పారు. అది అభిమానం కాదని అప్పట్లో ఆయనకు చెప్పానని.. కట్ చేస్తే కొన్ని నెలల తరువాత జరిగిన వెన్నుపోటు వ్యవహారంలో ఆయన కాళ్లు మొక్కిన ఆ ఆరుగురు మహిళలే ముందున్నారని వెల్లడించారు. అయితే ఆ మహిళలు ఎవరు అనే విషయాన్ని మాత్రం తాను చెప్పబోనని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. 
 
ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే అంశంపై కొంతకాలం క్రితం వైసీపీ తీవ్రంగా విమర్శలు గుప్పించింది. దీంతో ఈ అంశంపై ఎన్నుడూ లేని విధంగా  బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో ద్వారా చంద్రబాబు వివరణ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో తొలి ఓటరు మృతి.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు