అప్సర రాణి ప్రధాన పాత్రలో "తలకోన" చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ వేడుక గురువారం ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. మంత్ర ఎంటర్టైన్మెంట్ పతాకంపై సల్లా కుమార్ యాదవ్ సమర్పణలో నగేష్ నారదాసి దర్శకత్వంలో రూపొందుతుంది. గుర్తుందా శీతాకాలం నిర్మాత రామారావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ముహూర్తపు షాట్ కి క్లాప్ కొట్టారు.
Apsara Rani, Nagesh Naradasi, veerababu and others
ఈ సంద్భంగా చిత్ర దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ, క్రైమ్ థ్రిల్లర్ తో సాగే ఈ కథాంశం మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. అయితే ఫారెస్ట్ అనగానే కేవలం ప్రకృతి అందాలే కాదు అందులో ఇంకో కోణం కూడా ఉటుందని, అదే విదంగా పాలిటిక్స్, మీడియాను సైతం మిక్స్ చేసి చూపించడం జరుగుతుంది. అంతే కాకుండా ప్రకృతిలో ఏమేమి జరుగుతాయో తెలిపే ప్రయత్నం కూడా చేసాము. మెయిన్ కథాంశం అయితే తలకోన ఫారెస్ట్ లోకి కొంతమంది స్నేహితులు వెళ్తారు. ఎంత మంది వెళ్లారు ఎంతమంది తిరిగొచ్చారు అనేదే ప్రధానాంశంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా గా రూపొందిస్తున్నాము.. అందుకు తగ్గ టీమ్ ను, టెక్నికల్ టీమ్ కూడా సినిమాకు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో రానుంది. ఈ తలకోన చిత్రాన్ని 20రోజులు హైదరాబాద్ లో మరో 20 రోజులు తలకొనలో రెగ్యులర్ షూట్ చేయనున్నాము అని తెలిపారు.
నిర్మాతల్లో ఒకరైన డి.శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ... మొదటిసారి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాను.. మంచి స్టోరీ. తప్పక విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా అన్నారు.
సుభాష్ మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతూ... ఆల్రెడీ ఇందులో 2 సాంగ్స్ చేసాము.. మంచి బిజిమ్ కూడా కుదిరింది. సక్సెస్ అవుతుందని భావిస్తున్నా అన్నారు.
హీరోయిన్ అప్సర రాణి మాట్లాడుతూ, మంచి స్క్రిప్ట్స్ కు నేను ఫ్యాన్ ను. అదే ఇప్పుడు ఈ తలకోన చిత్రం చేయడానికి కారణం అయ్యింది. నా మొదటి నుంచి కూడా మంచి స్క్రిప్ట్ ఉన్న కథలనే ఎంచుకుంటాను. నాకు మంచి పేరును కూడా తెచ్చిపెట్టాయి. అలాగే ఈ చిత్రం కూడా మంచి విజయంతో పాటు మంచి పేరును కూడా ఇస్తుందని ఆశిస్తున్నా అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్కా, ప్రముఖ దర్శకుడు వేగేశ్న సతీష్,
నటీనటులు: అప్సర రాణి, అశోక్ కుమార్, అజయ్ ఘోష్, సుభాష్, రాజా రాయ్ తదితరులు
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నగేష్ నారదాసి
నిర్మాతలు: విశ్వేశ్వర శర్మ, దేవర శ్రీధర్ రెడ్డి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: బాసింశెట్టి వీరబాబు, జాన్ శామ్యూల్. నిర్వహణ: పరిటాల వీర గౌతమ్ రాంబాబు, డిఓపి: మల్లికార్జున్, మ్యూజిక్: సుభాష్ ఆనంద్, ఫైట్స్: విన్ చిన్ అంజి.