అమరావతి ఆంధ్రుల హక్కు .. టీడీపీ గెలవకుంటే తలెత్తుకుని తిరగలేరు : చంద్రబాబు

Webdunia
ఆదివారం, 7 మార్చి 2021 (13:13 IST)
అమరావతి ఆంధ్రుల హక్కు అని, దానికోసం జరిగే పోరాటానికి ఇంటికొక్కరు రావాలంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ 41వ డివిజన్‌లో ఆయన పర్యటించారు. అమరావతి కోసం విజయవాడ ప్రజలు ఇంటికొకరు రావాలని అన్నారు. అమరావతి కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్లామని, విజయవాడ ప్రజలు గట్టిగా నిలబడాలని చెప్పారు. 
 
పట్టిసీమ నీటి లబ్ధిదారులు ఆలోచించాలన్నారు. విజయవాడ మేయర్‌గా ఖచ్చితంగా తెదేపా అభ్యర్థే ఉండాలని, లేదంటే ఇక్కడి ప్రజలకు తలెత్తుకు తిరగలేరన్నారు. 'ఇక్కడి మంత్రికి దుర్గమ్మపైనా భయం, భక్తి లేదు. విజయవాడలో తెదేపా గెలవకుండా మీరు తలెత్తుకు తిరగలేరు. రాష్ట్రాన్ని నేరస్తులు, గూండాల అడ్డాగా మార్చారు' అని విమర్శించారు. పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్లను తీసేశారని దుయ్యబట్టారు.
 
అంతకుముందు శనివారం స్థానిక ఎన్నికల ప్రచారం కోసం విశాఖలో పర్యటించారు. జగదాంబ సెంటర్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉక్కు కర్మాగారం అంశాన్ని ప్రస్తావిస్తూ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. భూమి విలువ చూసిన జగన్‌కు త్యాగం విలువ తెలియదన్నారు. అందుకే స్టీల్ ప్లాంటు భూములను విక్రయించాలని అంటున్నాడని ఆరోపించారు.
 
విశాఖలో ఉక్కు కర్మాగారం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారని, వారి త్యాగాలకు జగన్ విలువ లేకుండా చేస్తున్నాడని విమర్శించారు. విశాఖ నగరపాలక ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రజలు అంగీకారం తెలిపినట్టు అవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. రౌడీలు, గూండాల నుంచి విశాఖను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments