Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారియట్ హోటల్‌లో పేకాట దందా.. తెదేపా మాజీ ఎమ్మెల్యే అరెస్టు...

హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో పేకాట దందా కొనసాగింది. ఈ నక్షత్ర హోటల్‌లో ఏకంగా 15 గదులను బుక్ చేసి పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు రహస్య సమాచారం వచ్చింది. దీంతో శుక్రవారం తెల్లవారుజామున పక్కా సమాచారంతో

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2017 (15:20 IST)
హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో పేకాట దందా కొనసాగింది. ఈ నక్షత్ర హోటల్‌లో ఏకంగా 15 గదులను బుక్ చేసి పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు రహస్య సమాచారం వచ్చింది. దీంతో శుక్రవారం తెల్లవారుజామున పక్కా సమాచారంతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం హోటల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 38 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.23 లక్షల నగదు, సెల్‌ఫోన్లు, స్వైపింగ్‌ మిషన్లు స్వాధీనం చేసుకున్నారు. 
 
నిందితుల్లో పలు సంపన్న కుటుంబాలకు చెందిన వారితో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. హోటల్‌లో ఆర్గనైజర్స్ 3 రూమ్స్ బుక్ చేశారని.. సంజయ్ అనే ఆర్గనైజర్‌తో పాటు మరో ఇద్దరు కూడా వేర్వేరుగా గదులు బుక్ చేసుకున్నారు. వీరంతా మూడు ముక్కలాట ఆడుతూ పట్టుబడ్డారు. వీరి దగ్గర నుంచి 24 లక్షల నగదుతో పాటు 1800 క్యాసినో కాయిన్స్, 38 సెల్‌ఫోన్స్, మద్యం బాటల్స్ స్వాధీనం చేసుకున్నామని టాస్క్ ఫోర్స్ డీసీపీ శశిధర్ రాజు వెల్లడించారు. 
 
మరోవైపు హైదరాబాద్‌ పంజాగుట్టలోని హరిత ప్లాజాపై శుక్రవారం తెల్లవారుజామున సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పేకాట ఆడుతూ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈలి నాని అలియాస్ వెంకట మధుసూధనరావు పట్టుబడ్డారు. నానితో పాటు మరోనలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.5.74 లక్షల నగదు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులను పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments