Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల తేదీని ప్రకటించే అధికారం మోడీకి అప్పగించిన ఈసీ : చిదంబరం

గుజరాత్ రాష్ట్ర ఎన్నికల తేదీని ప్రకటించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని నరేంద్ర మోడీకి అప్పగించిందంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆరోపించారు. శుక్రవారం ట్విటర్ వేదికగా ఆయ

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2017 (14:59 IST)
గుజరాత్ రాష్ట్ర ఎన్నికల తేదీని ప్రకటించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని నరేంద్ర మోడీకి అప్పగించిందంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆరోపించారు. శుక్రవారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ, ఎన్నికల సంఘం (ఈసీ) పనితీరు తీవ్రమైన విమర్శలకు దారితీస్తోందన్నారు. గుజరాత్ ఎన్నికల తేదీలను ప్రకటించక పోవడం వెనుక కారణమేంటంటూ నిలదీశారు. 
 
"ఈసీ తన సెలవులను పొడిగించుకుంది. గుజరాత్ ప్రభుత్వం అన్ని రకాల తాయిలాలు, రాయితీలు ప్రకటించిన తర్వాతే.. ఈసీకి మళ్లీ గుజరాత్ ఎన్నికలు గుర్తొస్తాయి.." అని చిదంబరం వ్యాఖ్యానించారు. అంతేకాదు గుజరాత్‌ ఎన్నికల తేదీ ప్రకటించే అధికారాన్ని ఈసీ ప్రధాని మోడీకి అప్పగించిందంటూ ఆరోపించారు. 'గుజరాత్‌లో తన చివరి ర్యాలీ సందర్భంగా మోడీ ఎన్నికల తేదీని ప్రకటిస్తారు. ఈ విషయాన్ని ఈసీకి కూడా చెబుతారులే..' అంటూ ఆయన ట్వీట్ చేశారు. 
 
నిజానికి ఈనెల 12వ తేదీనే ఎన్నికల సంఘం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీల ఎన్నికల తేదీలను ప్రకటించాల్సి ఉంది. కానీ, ఆ రోజున కేవలం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల తేదీలను వెల్లడించిన ఈసీ... గుజరాత్‌పై ఎన్నికల తేదీలపై మౌనం వహించింది. ఈ చర్యపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments