Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోసం చేసిన లెక్చరర్ - ఆత్మహత్య చేసుకున్న యువతి

Webdunia
సోమవారం, 15 జూన్ 2020 (12:53 IST)
ప్రేమ పేరుతో ఓ యువతిని లెక్చరర్ ఒకరు మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానన నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. దీంతో ఆ యువతి ప్రేమికుడి మోసాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లాలో జరిగింది 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సమీపంలోని నల్లాటూరుకు చెందిన మణి కుమార్తె మణిమేగలై (21) తాళవేడుకు చెందిన మునిరత్నం కుమారుడు రాజ్‌కుమార్‌ (26)నాలుగేళ్లుగా ప్రేమించు కుంటున్నారు. 
 
వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ యువతి కూడా తొందరపడింది. ఈ క్రమంలో యువతిని శారీరకంగా వాడుకున్న రాజ్‌కుమార్.. ఆ తర్వాత ముఖం చాటేశాడు. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయగా, అందుకు నిరాకరించాడు.
 
దీంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంచుకొని ఆత్మాహుతికి పాల్పడింది. ఈ ఘటనపై కనకమ్మసత్రం పోలీసులు కేసు నమోదుచేసి రాజ్‌కుమార్‌కు విచారిస్తున్నారు. రాజ్‌కుమార్‌ ఓ ప్రైవేటు విద్యాసంస్థలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments