Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవాలయాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలి.. స్వామీజీల డిమాండ్

వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలన్నది గత చరిత్ర. ఇపుడు దేవాలయాలకు ప్రత్యేక ప్రత్యేక హోదా ఇవ్వాలన్నది నేటి డిమాండ్. ఆలయాల పాలక మండళ్ళలో రాజకీయ నేతల జోక్యం మితిమీరిపోయిందని, అందువల్ల ఆలయాలకు స

Webdunia
బుధవారం, 17 మే 2017 (12:28 IST)
వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలన్నది గత చరిత్ర. ఇపుడు దేవాలయాలకు ప్రత్యేక ప్రత్యేక హోదా ఇవ్వాలన్నది నేటి డిమాండ్. ఆలయాల పాలక మండళ్ళలో రాజకీయ నేతల జోక్యం మితిమీరిపోయిందని, అందువల్ల ఆలయాలకు స్వయంప్రతిపత్తి లేదా ప్రత్యేక హోదా కల్పించాలని అనేకమంది స్వామీజీలు డిమాండ్ చేస్తున్నారు.
 
ఇదే అంశంపై శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి, జగద్గురు శంకరాచార్య, పుష్పగిరి శారద, లక్ష్మీ నృసింహ పీఠం పీఠాధిపతి శ్రీ విద్యానృసింహ భారతి, మాతా నిర్మలానంద యోగా భారతి, వీహెచ్‌పీ అధ్యక్షుడు ఎం.రామరాజు, టీటీడీ సంరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్‌ మనోహరరావులు విలేకరులతో మాట్లాడుతూ.... తెలుగు రాష్ట్రాల్లో దేవాదాయ, ధర్మాదాయ చట్టం సక్రమంగా అమలు కావడంలేదన్నారు. 
 
భక్తుల కానుకలతో అధికారులు జీతాలు తీసుకుంటూ రాజకీయ నేతలకు సేవలు చేస్తున్నారని విమర్శించారు. ముస్లింలకోసం ఏర్పాటుచేసిన వక్ఫ్‌ బోర్డులో ప్రభుత్వ జోక్యం కేవలం 1 లేదా 2 శాతమేనని చెప్పారు. ఇక చర్చిలది స్వతంత్ర ప్రతిపత్తి అన్నారు. కానీ హిందూ దేవాలయాలలో మాత్రం ప్రభుత్వాలు మితిమీరి జోక్యం చేసుకుంటాయన్నారు. 
 
దేవాలయాలకు ప్రత్యేక హోదా కోసం అన్ని సంఘాలను ఏకంచేసి, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న 34 వేల దేవాలయాలలో.. ఆదాయం వచ్చే 4 వేల దేవాలయాలకే ట్రస్ట్‌లు వేశారని, మిగతా వాటిని పట్టించుకోవడంలేదని విద్యానృసింహ భారతి ఆరోపించారు. దేవాలయాల పవిత్రతను కాపాడాలని వీహెచ్‌పీ అధ్యక్షుడు రామరాజు అన్నారు
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments