Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో లేడీ ఈవెంట్ డ్యాన్సర్ అనుమానస్పద మృతి, కారణం ఏమిటి?

ఐవీఆర్
బుధవారం, 30 అక్టోబరు 2024 (17:11 IST)
విజయవాడలోని ఆంధ్రప్రభ కాలనీలో ఓ లేడీ ఈవెంట్ డ్యాన్సర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్ నుంచి సోమవారం నాడు విజయవాడలోని తన స్నేహితురాలి ఇంటికి వచ్చి అక్కడ ఆమె ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కాకినాడలోని తూరంగికి చెందిన వెంకటలక్ష్మి అనే యువతి ఈవెంట్ డ్యాన్సర్ గా పనిచేస్తోంది. ఆమె ఎక్కువగా హైదరాబాదులో జరిగే ఈవెంట్లకు వెళ్లి డ్యాన్స్ చేస్తుంటుంది.
 
ఐతే సోమవారం నాడు ఆమె హైదరాబాద్ నుంచి విజయవాడలోని ఆంధ్రప్రభ కాలనీలో వుంటున్న తన మరో ఈవెంట్ డాన్సర్ జ్యోతి ఇంటికి వచ్చింది. అదేరోజు ఆమె స్నేహితుడు శ్రావణ్ కూడా వచ్చాడు. ముగ్గురు కలిసి ఆరోజు రాత్రి మద్యం సేవించారు. మరుసటి రోజు ఉదయం శ్రావణ్ హైదరాబాద్ బయలుదేరి వెళ్లాడు. ఐతే వెంకటలక్ష్మి సోమవారం రాత్రి ఉరి వేసుకుని చనిపోయింది.
 
దీనితో సీసీ కెమేరాలను పరిశీలించగా... శ్రావణ్ వేకువజామున వెళ్లేటపుడు అతడిని వెంకటలక్ష్మి సాగనంపుతూ కనిపించింది. అతడు వెళ్లాక ఉరి వేసుకున్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటన్నది దర్యాప్తు చేస్తున్నారు. వెంకటలక్ష్మి స్నేహితురాలు జ్యోతితో పాటుగా శ్రావణ్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రముఖ మ్యాగజైన్ మెన్స్ ఎక్స్‌పీ పై ప్రకృతి శక్తిగా శ్రుతి హాసన్

నేను ఇంట్రోవర్ట్ పర్సన్ ను కానీ కిరణ్ అబ్బవరం ని కలిశాక మారాను : నాగచైతన్య

కంగువ లో నాయకుడి గొప్పదనాన్ని తెలిపే సూర్య ఎంట్రీ సాంగ్ రిలీజ్

లక్కీ భాస్కర్ ప్రీమియర్ల ఆదరణతో షోలు కూడా పెంచాము : నిర్మాత సూర్యదేవర నాగవంశీ

కంగువ ఎడిటర్ నిషాద్ యూసుఫ్ కన్నుమూత.. ఆ ఫోటో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

ఎముక పుష్టి కోసం ఇవి తినాలి, ఇలా చేయాలి

ప్రియా.... నను క్షమించవా ఈ జన్మకి ఈ ఎడబాటుకి

తర్వాతి కథనం
Show comments