Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాపై కేసులన్నీ వారిద్దరు పెట్టినవే.. జంప్ ఎమ్మెల్యేలకు పదవులా?: జగన్

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తనపై పెట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమేనని అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఒక్కటై ఈ కేసులు పెట్టారని ఆరోపించారు. తన తండ్రి బతికున్నంత కాలం తన మీద ఏ కేసులు లేవన

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (15:56 IST)
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తనపై పెట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమేనని అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఒక్కటై ఈ కేసులు పెట్టారని ఆరోపించారు. తన తండ్రి బతికున్నంత కాలం తన మీద ఏ కేసులు లేవని.. అలాగే తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా కేసులు లేవన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడు బయటికి వచ్చానో.. అప్పుడే తనపై కేసులు పెట్టారన్నారు. 
 
అప్పట్లో అధికారంలో ఉన్న సోనియాగాంధీతో కలిసి చంద్రబాబునాయుడే తన పార్టీ నాయకుల ద్వారా తనపై ఈ కేసులు పెట్టించారన్నారు. నిజానికి ఒక వ్యక్తి తప్పు చేసినట్లు ఇంకా రుజువు కాకపోతే.. మూడు నెలల కంటే ఎక్కువ కాలం జైల్లో పెట్టే అధికారం లేదని, అయినా తనను 16 నెలల పాటు జైల్లో పెట్టారని తెలిపారు. జగన్ కనపడకపోతే పార్టీ ఉండదని భావించి చంద్రబాబు, తనను రాజకీయంగా అణగదొక్కేందుకే కాంగ్రెస్ కలిసి ఈ కుట్ర చేసిందన్నారు. 
 
ప్రస్తుతం ఢిల్లీలో ఏపీలో ప్రజాస్వామ్య రక్షణ కోసం వివిధ పార్టీ నేతలను జగన్మోహన్ రెడ్డి కలిశారు. ఇందులో భాగంగానే సీపీఐ అగ్రనేతలు సురవరం సుధాకర్ రెడ్డి, డి. రాజా తదితరులను కలిశారు. వైఎస్ఆర్‌సీపీ నుంచి ఎన్నికైన 21 మందిని టీడీపీలో చేర్చుకోవడమే కాక, వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చిన వైనాన్ని వారికి జగన్ ఈ సందర్భంగా వివరించారు. అనంతరం సురవరం, రాజాలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
 
ఈ సందర్భంగా కేసుల గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానం ఇచ్చారు. తనపై కేసులు పెట్టడం కొత్తేమీ కాదన్నారు. ఇదంతా చంద్రబాబు పనేనని దుయ్యబట్టారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments