దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, ఎంపీ విజయసాయిరెడ్డి, అడ్వకేట‌్ సుభాష్‌లపై విచారణ జరపాలని ఏసీ శాంతి భర్త మదన్‌మోహన్ మంత్రి లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు. విజయసాయి రెడ్డిపై పోరాడుతున్నందుకు తనను ఏపీ నుంచి బదిలీ చేయించారని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ మంత్రి నారా లోకేష్‌కు ఫిర్యాదు చేశారు.
తన భార్యను లోబర్చుకొని రూ.1500 కోట్ల భూములు కొల్లగొట్టారని, సాయిరెడ్డికి డిఎన్ఎ పరీక్షలు నిర్వహించి వాస్తవాలు నిగ్గుతేల్చాలని విజ్ఞప్తి చేశారు. అక్రమాలను బయటపెట్టినందుకు తనను బదిలీ చేయించారని ఆరోపించారు. వందల కోట్ల భూములు అన్యాక్రాంతం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో నారా లోకేష్ ప్రజాదర్బార్‌కు విచ్చేసిన మదన్ మోహన్... మంత్రి లోకేష్‌ను కలిసి తన గోడునువెళ్లబోసుకున్నారు.
ఐఐపిలో అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేస్తున్నానని, ఎంపీ విజయసాయి రెడ్డి, అడ్వకేట్ సుభాష్ కలసి తన భార్య కళింగిరి శాంతిని లోబర్చుకొని విశాఖలో ఆర్కే బీచ్ నుంచి భీమిలివరకు పెద్దఎత్తున భూములు కొల్లగొట్టారని ఆరోపించారు.