Webdunia - Bharat's app for daily news and videos

Install App

కానిస్టేబుల్‌తో భార్య రొమాన్స్... గడియపెట్టి స్థానికులకు పట్టించిన ఖాకీ భర్త...

ఓ కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చిన భార్యను మరో ఖాకీ భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరి బాగోతాన్ని ఇరుగుపొరుగువారిని పిలిచి చూపించి పరువు తీశాడు. కానిస్టేబుల్‌తో

Webdunia
ఆదివారం, 5 ఆగస్టు 2018 (15:33 IST)
ఓ కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చిన భార్యను మరో ఖాకీ భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరి బాగోతాన్ని ఇరుగుపొరుగువారిని పిలిచి చూపించి పరువు తీశాడు. కానిస్టేబుల్‌తో కలిసి ఇంట్లో తన భార్య అసభ్యకర భంగిమలో ఉండటాన్ని గమనించిన ఆ భర్త... తలపుకు గడియపెట్టి స్థానికులను పిలిచిమరీ చూపించాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వరంగల్లో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఆతకూరి కొండల్‌ రావుకు సంధ్య అనే మహిళతో గత 2016లో వివాహమైంది. ఈయన తన తల్లిదండ్రులతో కలిసి కోదాడ శ్రీమన్నారయాణ కాలనీలో నివాసముంటున్నాడు. 
 
ఈ క్రమంలో సూర్యపేట జిల్లా కోదాడకు చెందిన కుర్రాడపు వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్‌ సూర్యపేట పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈయనకు కొండల్ రావు భార్య సంధ్యతో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
అయితే, గత కొన్ని రోజులుగా భార్య ప్రవర్తనలో మార్పు గమనించిన కొండల్ రావు... ఆమెపై నిఘా పెట్టాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి వెంకటేశ్వర్లుతో కలిసి సంధ్య ఓ ఇంట్లో ఏకాంతంగా ఉండటాన్ని కొండల్ రావు గమనించాడు. 
 
ఆ తర్వాత మరో ఆలోచన లేకుండా తలుపుకు గడియపెట్టి.. ఇరుగు పొరుగువారిని పిలిచి వారిద్దరిని పట్టించాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించడంతో ఖాకీలకు వచ్చిన వెంకటేశ్వర్లుతో పాటు.. సంధ్యను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments