Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య అక్రమ సంబంధం : మనస్తాపంతో భర్త ఆత్మహత్య

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (15:25 IST)
కట్టుకున్న భార్య పరాయి పురుషుడుతో అక్రమ సంబంధం పెట్టుకుందన్న విషయం తెలిసిన భర్త తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి మండలం కొత్త తండాలో గురువారం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు ముందు మృతుడు తీసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మఠంపల్లి మండలలోని అల్లీపురం గ్రామానికి చెందిన తాళ్ళూరి కాంతాచారి(32) అదే మండలం కొత్త తండాలో రాయి నుంచి ఇసుక తయారీ చేసే ఫ్యాక్టరీ‌ నిర్వహిస్తున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 
గత కొంతాకాలం నుంచి ఈయన భార్య... కాలేజీ రోజుల్లో చదువుకున్న వ్యక్తితో అక్రమ‌ సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయం తెలిసిన కాంతాచారి పలుమార్లు మందలించినా భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. 
 
కుటుంబ సభ్యులు ఎన్నోసార్లు నచ్చచెప్పిన వినలేదని దీంతో మానసిక వేదనకు గురైన కాంతాచారి బుధవారం రాత్రి భార్య అక్రమ సంబంధాన్ని సహించలేక కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో‌ పోస్ట్ చేశాడు.
 
ఆ వెంటనే ఆగమేఘాలపై బంధువులు, మిత్రులు వెళ్లి కాంతాచారిని రక్షించి, ఇంటికి తీసుకొచ్చారు. అప్పటికీ ఆయన మనశ్శాంతిగా ఉండలేకపోయారు. అదే రోజు రాత్రి తన సొంత శాండ్ ఫ్యాకరీలో నిద్రించి, గురువారం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాంతాచారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments