Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్ కేసు : విజయపాల్‌కు సుప్రీంకోర్టు షాక్...

ఠాగూర్
సోమవారం, 25 నవంబరు 2024 (16:31 IST)
గత వైకాపా ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు.. ఆ పార్టీకి నరసాపురం మాజీ ఎంపీ, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయపాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలన్న ఆయన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. సుదీర్ఘ వాదనల అనంతరం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రసన్న బి.వరాలేతో కూడిన ధర్మాసనం విజయ్ పాల్ పిటిషన్‌ను కొట్టివేసింది. 
 
సీబీఐ కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారులపై కేసు నమోదు చేయాలంటూ రఘురామరాజు ఇటీవల గుంటూరులో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి, సీఐడీ డీజీ సునీల్, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిని నగరపాలెం పోలీసులు నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం గత నెలలో హైకోర్టును ఆశ్రయించగా విజయ్పల్కు అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. బెయిలు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తాజాగా, తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా నిరాశే ఎదురైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments