Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్.. మద్దతు పలికిన అజిత్ పవార్

ఠాగూర్
సోమవారం, 25 నవంబరు 2024 (15:36 IST)
మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్‌ను ప్రకటించే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన.. ముగిసిన ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. దీనికితోడు బీజేపీ అత్యధిక స్థానాల్లో సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఎంపిక చేయొచ్చనే వార్తలు వినొస్తున్నాయి. అదేసమయంలో దేవేంద్రకు ఎన్సీపీ నేత అజిత్ పవార్ సైతం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీంతో సీఎం అభ్యర్థిగా ఫడ్నవిస్ పేరును ప్రకటించడం లాంఛనప్రాయంగా మారింది. 
 
మరోవైపు, ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే కూడా అదే పదవిలో కొనసాగాలనుకుంటున్నారు. అత్యధిక సీట్లు గెలుచుకున్న తమ పార్టీకి సీఎం పదవి రావాలని బీజేపీ కోరుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి అంశంపై అజిత్ పవార్ స్పందించారు. భాగస్వామ్య పార్టీలు కలిసి ముఖ్యమంత్రి పదవిపై నిర్ణయం తీసుకుంటాయని అజిత్ పవార్ వెల్లడించారు. 
 
అసెంబ్లీలో ఎన్సీపీ నేతగా తనను తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారన్నారు. శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండే, బీజేపీ నుంచి ఫడ్నవీస్ ఎన్నికైనట్లు తెలిపారు. తాము ముగ్గురం కూర్చొని ముఖ్యమంత్రి పదవిపై తుది నిర్ణయానికి వస్తామన్నారు. 
 
మహారాష్ట్ర శాసన సభ గడువు మంగళవారంతో ముగియనుంది. గెలిచిన కూటమి ఆ తర్వాత 24 గంటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. లేదంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మహాయుతి కూటమి భావిస్తోంది.
 
కాగా, ముగిసిన ఎన్నికల్లో బీజేపీ 132, ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేన పార్టీ 57, అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీ 41 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రతిపక్ష ఎంవీఏ కూటమి నుంచి శివసేన (యూబీటీ) 20, కాంగ్రెస్ 16, ఎన్సీపీ (ఎస్పీ) 10 సీట్లు దక్కించుకున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 145 సీట్లు అవసరం. ఇపుడు బీజేపీకి అజిత్ పవార్ వర్గం మద్దతు తెలుపడంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments