Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ పోస్టుల్లో ఎలాంటి భాష వాడారో మాకు అర్థం కాదనుకుంటున్నారా? సజ్జలపై సుప్రీం ఫైర్

ఠాగూర్
శుక్రవారం, 23 మే 2025 (13:19 IST)
సోషల్ మీడియాను దుర్వినియోగం చేయడంతో పాటు మీరు పెట్టిన పోస్టుల్లో ఎలాంటి భాష వాడారో మాకు అర్థం కాదనుకుంటున్నారా అని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులకు సంబంధించిన కేసుల్లో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
"సోషల్ మీడియాలో మీరు పెట్టిన పోస్టులు మాకు అర్థం కాలేదనుకున్నారా? ఏ ఆలోచనలతో పోస్టులు పెట్టారో ఆ మాత్రం తెలుసుకోలేమా? ఆ పోస్టులు భరించరాని స్థాయికి వెళ్లాయి. తప్పు ఎవరు చేసినా తప్పే. ఇలాంటి వాటిని వ్యవస్థ క్షమించదు. తప్పక శిక్షిస్తుంది. సోషల్ మీడియా దుర్వినియోగం కేసుల్లో త్వరగా బెయిల్ వస్తుందని అనుకోవద్దు. అలా బెయిల్ వస్తే ప్రతి ఒక్కరూ ఇష్టారీతిన వ్యవహరిస్తారు అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
అదేసమయంలో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. అరెస్టు నుంచి 2 వారాల పాటు మధ్యంత ఉపశమనం కల్పించింది. ఆలోపు ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments