Supreme Court: కొమ్మినేనికి బెయిల్- సుప్రీం ఆదేశాలు చంద్రబాబుకు చెంపపెట్టు లాంటిది: జగన్

సెల్వి
శుక్రవారం, 13 జూన్ 2025 (22:19 IST)
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై మాజీ ముఖ్యమంత్రి, వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. సుప్రీం ఆదేశాలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చెంపపెట్టులాంటిదని జగన్ అన్నారు. 
 
చంద్రబాబు నాయుడు నిరంకుశంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని జగన్ ఆరోపించారు. "ఈ అరెస్టు ప్రాథమిక హక్కులు మరియు భావ ప్రకటనా స్వేచ్ఛను తీవ్రంగా ఉల్లంఘించడమేనని కోర్టు సరిగ్గానే పేర్కొంది" అని ఎక్స్ ద్వారా జగన్ తెలిపారు. 
 
'సాక్షి'లో జరిగిన చర్చ సందర్భంగా అమరావతి మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేయడంపై స్పందిస్తూ పోస్ట్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి కుటుంబ యాజమాన్యంలోని ఛానల్‌కు యాంకర్‌గా ఉన్న శ్రీనివాసరావు ఈ షోను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్యానెలిస్టులలో ఒకరు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.
 
దీంతో సాక్షి టీవీపై దాడులు జరిగాయి. కొమ్మినేనిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిని జగన్ ఖండించారు. చంద్రబాబు మీడియా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కారని మాజీ జగన్ అన్నారు. కానీ కోర్టు ఆదేశాలు ఈ కుట్రను బద్దలు కొట్టింది, సత్యం గెలుస్తుందని దేశానికి మరోసారి గుర్తు చేసిందని జగన్ తెలిపారు. 
 
సుప్రీం కోర్టు శుక్రవారం శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేసి, ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది. అరెస్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, రావు పాత్రికేయ హక్కులు మరియు అతని ప్రాథమిక వాక్ స్వాతంత్య్ర హక్కును కాపాడటం అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
 
70 ఏళ్ల జర్నలిస్టు కొమ్మినేనిని జూన్ 9న హైదరాబాద్‌లోని ఆయన నివాసం నుండి రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.  ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అమరావతి ప్రాంత మహిళల గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు వివి కృష్ణంరాజును కూడా జూన్ 11న పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరులోని కోర్టు ఆయనను జూన్ 26 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments