Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్‌లో స్టార్ ఉద్యోగినిపై లైంగిక దాడి... పిలవగానే ఆ యువతి ఎందుకెళ్లినట్టు?

వైజాగ్ నగరంలో పేరొందిన ఓ స్టార్‌ హోటల్‌లో పనిచేస్తున్న ఓ యువతిపై సామూహిక లైంగిక దాడి జరిగిందని చేసిన ఫిర్యాదు కలకలం రేపింది. సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆ యువతి మూడో పట్టణ పోలీసులను ఆశ్రయించడం వి

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (13:07 IST)
వైజాగ్ నగరంలో పేరొందిన ఓ స్టార్‌ హోటల్‌లో పనిచేస్తున్న ఓ యువతిపై సామూహిక లైంగిక దాడి జరిగిందని చేసిన ఫిర్యాదు కలకలం రేపింది. సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆ యువతి మూడో పట్టణ పోలీసులను ఆశ్రయించడం విశేషం. ఈ కేసులో రెండు నెలల క్రితం వరకు ఓ స్టార్‌ హోటల్‌లో పని చేసి మానేసిన శ్రీధర్‌ అనే వ్యక్తి ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. 
 
దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ లైంగికదాడిలో శ్రీధర్‌తో సహా నలుగురు లైంగిక దాడికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీధర్‌తోపాటు విజయవాడకు చెందిన వినయ్‌ అనే వ్యక్తి.. ఇంకో ఇద్దరు నాలుగో తేదీ రాత్రి ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించినట్లు సమాచారం. 
 
వినయ్‌ విశాఖ వచ్చిన సందర్భాల్లో అదే హోటల్లో దిగేవాడని అంటున్నారు. ఆ క్రమంలోని గతంలో అక్కడ పని చేసిన శ్రీధర్‌తో పరిచయం పెరిగిందన్న వాదన వినిపిస్తోంది. వీరిద్దరు కాకుండా దాడిలో పాల్గొన్న మరో ఇద్దరు ఎవరిన్నది ఇంకా అంతుచిక్కడం లేదు. నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నా.. శ్రీధర్‌ మాత్రం వారి అదుపులో ఉన్నట్లు సమాచారం. 
 
అయితే, విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న యువతి... శ్రీధర్ పిలవగానే ఎందుకు వెళ్లిందన్నది ఇపుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఎంత పరిచయస్తుడైనా పిలవగానే.. అర్థరాత్రి వెళ్లడం ఏమిటి?.. వెళ్లినా మద్యం సేవించి రాత్రితెల్లవార్లు ఉండిపోవడం.. లైంగిక దాడికి పాల్పడినవారెందరన్న విషయంలో స్పష్టత లేకపోవడం పోలీసులను తికమకపెడుతోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం