Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టార్ హోమియోపతి, ఆయుర్వేద బూస్టర్ కిట్ విడుదల

Webdunia
బుధవారం, 1 జులై 2020 (19:37 IST)
దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడంలో హోమియోతో పాటు ఆయుర్వేద వైద్యం అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందింది. హోమియోపతి, ఆయుర్వేద వైద్య రంగంలో విశేష అనుభవం గడించిన స్టార్ హోమియోపతి మరియు స్టార్ ఆయుర్వేద ఇటీవల స్టార్ ఇమ్యూనిటీ క్లినిక్స్‌ను ప్రారంభించింది. ఈ తరుణంలో ప్రపంచ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రోగనిరోధక శక్తిని పెంచే బూస్టర్ కిట్‌ను విడుదల చేసింది.
 
విజయవాడలోని స్టార్ హోమియోపతి అండ్ ఆయుర్వేద కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్టార్ హోమియోపతి అండ్ స్టార్ ఆయుర్వేద మేనేజింగ్ అండ్ డైరెక్టర్ శ్రీనివాసగుప్తా, క్లినికల్ డైరెక్టర్ అర్చనా హరిహరన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస గుప్తా మాట్లాడుతూ, కుటుంబంలోని నలుగురికి సరిపడే ఈ బూస్టర్ కిట్లో ఇమ్యునో బూస్ట్ డ్రాప్స్, హోమియో పిల్స్, ఆయుర్వేద మాత్రలు వుంటాయని వెల్లడించారు.
 
సాధారణ ఆరోగ్య సమస్యలతో పాటు వర్షాకాలంలో, చలి కాలంలో వచ్చే సాధారణ వ్యాధులకు కూడా ఈ బూస్టర్ కిట్ ఉపయోగించవచ్చని తెలిపారు. డాక్టర్స్ డేను పురస్కరించుకుని పది రోజుల పాటు ఉచిత డాక్టర్ కన్సల్టేషన్ సౌకర్యం అందిస్తున్నామని వివరించారు. ఇతర వివరాల కోసం 92468 00033 నెంబరులో కానీ టోల్ ఫ్రీ నెంబర్ 1800-108-5566 నెంబరులో కానీ సంప్రదించవచ్చని తెలిపారు.
 
క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ అర్చనా హరిహరన్ మాట్లాడుతూ... ఇటీవల కరోనావైరస్ కుటుంబంలోని అందరి గురించి ఆలోచించే పరిస్థితి కల్పించిందని, మనిషి తన రోగనిరోధక శక్తిని పెంచుకుంటే ఆరోగ్యంగా వుండవచ్చని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్, కొత్తపేట, కూకట్ పల్లి, హన్మకొండ, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, నెల్లూరు, కర్నాటక లోని బెంగళూరులోని స్టార్ హోమియోపతి, ఆయుర్వేద బ్రాంచ్ లలో ఈ సౌకర్యం వుంటుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments