ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ బాదుడు - 7 తర్వాత ఎపుడైనా...

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (12:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో బాదుడుకు శ్రీకారం చుట్టనుంది. భూముల విలువను పెంచి, తద్వారా రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా వసూలు చేయనున్నారు. ఈ రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపై ఇప్పటికే అనేక విధాలుగా కసరత్తులు చేసిన ఏపీ ప్రభుత్వం... ఈ చార్జీల బాదుడును 10 నుంచి 50 శాతం మేరకు పెంచేందుకు సిద్ధమైంది. ఈ బాదుడు కూడా ఈ నెల 7వ తేదీ తర్వాత ఎపుడైనా చేపట్టవచ్చు. 
 
ఈ భూముల విలువను పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తిచేసింది. ఇప్పటివరకు ఎంతెంత విలువలున్నాయి?, కొత్తగా పెంచేందుకు రూపొందించిన ప్రతిపాదనలు ఏమిటి? పెరుగుదల ఎంత? అనే వివరాలను రూపొందించారు. జిల్లాల జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ల నుంచి ఆ ప్రతిపాదనలకు ప్రాథమికంగా అనుమతి తీసుకున్నారు. 
 
రెండు రోజుల క్రితమే ఈ పని పూర్తచేసిన సబ్ రిజిస్ట్రార్లు పెరుగదలకు సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్ ఐజీఆర్ఎస్ డాట్ కామ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. దీంతో ఈ నెల 7వ తేదీ తర్వాత ఎపుడైనా రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడును మొదలుపెట్టనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments