Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్‌లో ఎంజీ మోటార్ ఇండియా నెల్లూరులో విక్రయ కేంద్రం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో ఎంజీ మోటార్ ఇండియా నెల్లూరులో విక్రయ కేంద్రం ప్రారంభం
, సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (20:18 IST)
దేశవ్యాప్తంగా కారు కొనుగోలు అనుభూతిని పునర్ నిర్వచించేందుకు తనకు గల కట్టుబాటును చాటిచెబుతూ ఎంజీ మోటార్ ఇండియా నేడిక్కడ ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో తన నూతన విక్రయ కేంద్రాన్ని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియం ఎస్‌యూవీలకు గల పటిష్ట మార్కెట్ శక్తిసామర్థ్యాలను గుర్తిస్తూ, ఈ నూతన కేంద్రం నగరంలోని మరింత మంది కొనుగోలుదారుల ప్రయాణ అవసరాలను తీర్చనుంది. ఈ నూతన షో రూమ్ కొనుగోలుదారులకు లుక్ అండ్ ఫీల్‌ను అందించడమే గాకుండా సంస్థ బ్రిటిష్ వారసత్వాన్ని కూడా ప్రతిబింబించనుంది.

 
నూతన షోరూమ్ ప్రారంభంతో ఈ కార్ల తయారీ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో 12 టచ్ పాయింట్లను నిర్వహిస్తున్నట్లయింది. 2022 చివరి నాటికి ఆంధ్రప్రదేశ్‌లో వీటి సంఖ్యను 18కి పెంచాలని కూడా సంస్థ యోచిస్తోంది. ఈ బ్రాండ్ భారతదేశ వ్యాప్తంగా 307 టచ్ పాయింట్స్‌ను కలిగి ఉంది.

 
ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ఎంజీ మోటార్ ఇండియా డీలర్ డెవలప్మెంట్ డైరెక్టర్ శ్రీ పంకజ్ పార్కర్ మాట్లాడుతూ, ‘‘ఆంధ్రప్రదేశ్‌లో మా కొనుగోలుదారులకు చేరువలో ఉండేందుకు రిటైల్ ఉనికిని విస్తరించాలన్న మా ప్రణాళికలకు అనుగుణంగానే ఎంజీ నెల్లూరు ప్రారంభించబడింది. ఇది ఇక్కడి కొనుగోలుదారుల విక్రయ, సర్వీస్, విడిభాగాలు, యాక్సెసరీస్ అవసరాలను తీరుస్తుంది’’ అని అన్నారు.

 
ఈ సందర్భంగా ఎంజీ తిరుపతి డీలర్ ప్రిన్సిపల్ శ్రీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘అగ్రగామి, భవిష్యత్ సన్నద్ధక బ్రాండ్‌గా, వినూత్నత, సాంకేతిక చోదిత ధోరణులతో ఎంజీ ఇప్పటికే భారతీయ వాహనరంగంలో సంచలనాలు సృష్టించింది. ఈ బ్రాండ్‌తో అనుబంధం మాకెంతో ఆనందదాయకం. ఎంజీ పటిష్ట బ్రిటిష్ వారసత్వం, సాంకేతికతపై దృష్టితో మేం ప్రయోజనం పొందనున్నాం. నెల్లూరు లోని కొనుగోలుదారులకు విశిష్ట వాహన రిటైల్ అనుభూతిని అందించనున్నాం’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ పని చేయమన్నాడు, అందుకే కొడుకుతో కలిసి భర్తను హత్య చేసింది భార్య