అందరిలానే తన భర్త మంచి వ్యక్తని భావించింది. పెళ్ళయి 20 యేళ్ళ వయస్సున్న కొడుకు ఉన్నాడు. ఉన్నత చదువులు చదువుతున్నాడు. ఇంట్లో ఒంటరిగానే వివాహిత ఉండేది. మద్యం జోలికి వెళ్ళని తన భర్త ఉన్నట్లుండి మద్యానికి బానిసయ్యాడు. అందుకు కారణం చెడు స్నేహమే. ఇది కాస్త ఆ కుటుంబం సర్వనాశనం అవ్వడానికి కారణమైంది.
ఇండోర్ సమీపంలోని ఉమ్రిఖేడా ప్రాంతంలో నివాసముంటున్నారు బబ్లూ, సునీత. ఆయిల్ ఫ్యాక్టరీని నడుపుతున్నాడు బబ్లూ. బాగానే సంపాదిస్తున్నాడు. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత డబ్బులు ఇంకా బాగా సంపాదించాడు.
అసలు మద్యం జోలికే వెళ్ళని బబ్లూ ఉన్నట్లుండి దానికి బానిసయ్యాడు. చెడు స్నేహం అతన్ని మద్యంవైపు నడిపించింది. సాయంత్రం స్నేహితులతో బాగా ఎంజాయ్ చేసేవాడు. ఇంటికి వచ్చి స్నేహితులతో కలిసి తాగేవాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి. తన స్నేహితులతో గడపాలంటూ భార్యపై ఒత్తిడి తెచ్చాడు. భర్త మద్యం మత్తులో ఉన్నాడని ఎన్నోసార్లు సర్దుకుపోయింది ఆ వివాహిత. కానీ భర్త వేధింపులు ఎక్కువ కావడంతో ఆవిషయాన్ని తన కొడుక్కి చెప్పింది.
దీంతో ఇద్దరూ కలిసి తండ్రి హత్యకు ప్లాన్ చేశారు. బబ్లూ తినే అన్నంలో మత్తు మందు కలిపేశారు. ఆ తరువాత ఊపిరాడకుండా చంపేశారు. తన భర్త బాగా తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళి చనిపోయాడంటూ భార్య నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే పోస్టుమార్టంలో అసలు విషయం బయటపడింది.