Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొద‌టిసారి ఆన్‌లైన్ సేవ‌గా శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వం‌ (video)

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (19:04 IST)
తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ప్ర‌తి రోజు నిర్వ‌హించే శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వాన్ని కోవిడ్ - 19 నేప‌థ్యంలో భ‌క్తుల కోరిక మేర‌కు ఆన్‌లైన్ విధానంలో ఆగ‌స్టు 7వ తేదీ గురువారం నుండి నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. 
 
ఆగ‌స్టు 7 నుండి 31వ తేదీ వ‌ర‌కు గ‌ల క‌ల్యాణోత్స‌వం టికెట్ల‌ను ఆగ‌స్టు 6వ తేదీ ఉద‌యం 11.00 గంట‌ల నుండి ఆన్ లైన్‌లో భ‌క్తుల‌కు అందుబాటులో ఉంటాయి. 

టికెట్లు కావ‌ల‌సిన గృహ‌స్తులు టిటిడి వెబ్‌సైట్‌లో (www.tirupatibalaji.ap.gov.in) త‌మ వివ‌రాలు పొందుప‌ర్చి, టిటిడి నియ‌మ నిబంధ‌న‌లకు లోబ‌డి గేట్‌వే ద్వా‌రా రూ.1000/- చెల్లించి ఆన్‌లైన్ ర‌శీదు పొంద‌వ‌చ్చు. శ్రీ‌వారి ప్ర‌సాదాలను పోస్ట‌ల్ శాఖ‌ ద్వారా టిటిడి ఉచితంగా అందిస్తుంది.  
 
స్వామివారి క‌ల్యాణోత్స‌వం ప్ర‌తి రోజు మ‌ధ్యాహ్నం 12.00 గంట‌ల‌కు ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారమవుతుంది. క‌ల్యాణోత్స‌వంలో పాల్గొనే గృహ‌స్తులు సాంప్ర‌దాయ దుస్తులు ధ‌రించి, అర్చ‌క స్వాముల సూచ‌న‌ల మేర‌కు త‌మ గోత్ర ‌నామాల‌తో సంక‌ల్పం చెప్పాల్సి ఉంటుంది. కాగా, ఆన్ లైన్ లో టికెట్లు పొందిన  గృహ‌స్తుల గోత్ర నామాలను స్వామివారికి నివేదిస్తారు. 
 
          
ఈ సేవ‌లో పాల్గొనే భ‌క్తుల‌కు ఉత్త‌రియం, ర‌విక‌, అక్షింత‌లు ప్ర‌సాదంగా ఇండియా పోస్ట‌ల్ ద్వారా గృహ‌స్తుల చిరునామాకు పంప‌డం జ‌రుగుతుంది. 
 
టికెట్లు బుక్ చేసుకునే విధానం:
- ముందుగా www.tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ కు లాగిన్ అవ్వాలి.
 
- ఆన్‌లైన్‌లో క‌ల్యాణోత్స‌వం (ఆన్‌లైన్ పార్టిసిపేషన్) అనే బటన్ ని క్లిక్ చేయాలి.
 
- ఇక్కడ టిటిడి పొందుపరిచిన సూచనలను అంగీకరిస్తూ I Agree అనే బాక్స్‌ లో టిక్ గుర్తు పెట్టాలి.
 
- ఆ తర్వాత క‌ల్యాణోత్స‌వం తేదీని,  గృహస్తుల(ఇద్దరు) పేర్లు, వయసు, లింగం, గోత్రం, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ప్రసాదాలు పంపిణీ కోసం చిరునామా వివరాలు పొందుపరచాలి. 
 
- ఈ సమాచారాన్ని సరిచూసుకొని కంటిన్యూ అనే బటన్ నొక్కితే పేమెంట్ పేజి వస్తుంది.
 
- ఏదైనా బ్యాంకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాకింగ్‌ ద్వారా సదరు టికెట్ మొత్తాన్ని చెల్లించవచ్చు.
 
- పేమెంట్ పూర్తయిన అనంతరం టికెట్ ఖరారవుతుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments