విశాఖలో ఘోరం... స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సూసైడ్

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (18:57 IST)
విశాఖలో ఘోరం జరిగింది. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖపట్టణంలోని ఆర్కే బీచ్ రోడ్డులో ఆయన ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా కృష్ణవర్మ పని చేస్తున్నారు. ఈయన గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నట్టు సమాచారం. 
 
ఈ పరిస్థితుల్లో ఆయన ఆరోగ్య పరంగా మరింత అస్వస్థతకు లోనయ్యారు. దీంతో విశాఖ బీచ్‌కు వెళ్లిన కృష్ణవర్మ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు ఆయన భార్య ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటనపై ఎంవీపీ పోలీస్ స్టేషన్ సీఐ షణ్ముఖరావు మాట్లాడుతూ, కృష్ణ వర్మ కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారని, శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆయన భార్య ఫిర్యాదు చేశారని, ఈ మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు. 
 
వర్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించామని అన్నారు. కాగా, అనారోగ్య కారణాలతో కృష్ణ వర్మ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ఆయనకు గుండె ఆపరేషన్ అయినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments