Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడికి సర్వస్వాన్ని అప్పగించిన గృహిణి.. చివరకు అతని చేతుల్లోనే...

Webdunia
ఆదివారం, 20 జనవరి 2019 (10:07 IST)
భర్త దుబాయ్‌లో ఉండటంతో పడకసుఖం కోసం పరాయి పురుషునితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ గృహిణి.. చివరకు అతని చేతుల్లోనే బలైపోయింది. తన పెళ్లికి అడ్డొస్తుందన్న అక్కసుతో ఆ మహిళను ప్రియుడు చంపేసి దహనం చేశాడు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ దారుణ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని బలరాంపురం గ్రామానికి చెందిన కుశుమన్న - లక్ష్మీలకు 15 యేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, తాపీ పని చేసే కుశుమన్న ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో పడక సుఖం కోసం పరితపించిన లక్ష్మీ.. గ్రామానికి చెందిన సంపతి రావు భాస్కర రావు అనే పెళ్లికాని యువకుడుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో తన ప్రియుడుకి లక్ష్మీ సరస్వం అప్పగించింది. భర్త పంపిన డబ్బులు కూడా ఇచ్చేది. 
 
ఈ నేపథ్యంలో పెళ్లీడుకొచ్చిన భాస్కర రావుకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీ.. భాస్కర రావును నిలదీసింది. దీంతో ఆగ్రహించిన భాస్కర రావు... ఆమెను అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశ్యంతో ఆమెను బయటకు తీసుకెళ్లి చంపేశాడు. ఆ తర్వాత పెట్రోల్ పోసి కాల్చి, ఏమీ ఎరుగనట్టుగా ఇంటికి వచ్చాడు. 
 
రెండు మూడు రోజులుగా తన చెల్లి ఇంటికి రాకపోవడంతో సందేహించిన లక్ష్మీ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేసి.. భాస్కర రావుపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో భాస్కర రావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం వెల్లడించాడు. దీంతో అతనిపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments