Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలకు మించిన అప్పు ఉంది .. రాత్రిల్లో మద్యం సేవించేది : శ్రీదేవి చిన్నాన్న వేణుగోపాల్ రెడ్డి

నటి శ్రీదేవిని ఆర్థికపరమైన ఇబ్బందులే బాగా కుంగదీశాయని ఆమె చిన్నాన్న వేణుగోపాల్ రెడ్డి అంటున్నారు. పెళ్ళి తర్వాతే శ్రీదేవి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందం కోసం శ్రీదేవి ఎంతో పాకులాడేదని, ముక్కుకు

Webdunia
మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (17:28 IST)
నటి శ్రీదేవిని ఆర్థికపరమైన ఇబ్బందులే బాగా కుంగదీశాయని ఆమె చిన్నాన్న వేణుగోపాల్ రెడ్డి అంటున్నారు. పెళ్ళి తర్వాతే శ్రీదేవి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందం కోసం శ్రీదేవి ఎంతో పాకులాడేదని, ముక్కుకు మూడుసార్లు సర్జరీ కూడా చేయించుకున్నారని చెప్పారు. ఒక సందర్భంలో చర్మం ముడతలు పడకుండా కూడా ఆపరేషన్ చేయించుకుని అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. 
 
అలాగే, శ్రీదేవి పెళ్లి కుటుంబ సభ్యులకు తెలియకుండానే జరిగిందన్నారు. కనీసం మాటమాత్రం కూడా చెప్పకుండా బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకుందన్నారు. ఎపుడైనా తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తే బోనీ కపూర్ తమతో పెద్దగా కలిసేవాడు కాదని, పెళ్ళయిన తర్వాత శ్రీదేవి బంధువులను దూరం పెడుతూ వచ్చిందన్నారు. 
 
అదేసమయంలో శ్రీదేవి రాత్రి వేళల్లో మద్యం సేవించేదని మా వాళ్ళు చెప్పారు.. కానీ నేను ప్రత్యక్షంగా చూడలేదని వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. శ్రీదేవి వంటి మంచి వ్యక్తిని కోల్పోవడం ఎంతో బాధించిందని, తన ఇద్దరు పిల్లలను ఆర్థికంగా నిలబెట్టాలని శ్రీదేవి ఎంతో తాపత్రయ పడుతూ ఉండేదని చెప్పారు. శ్రీదేవి అప్పులు తీర్చేంత ఆర్థిక స్తోమత మా బంధువుల్లో ఎవరికీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

తర్వాతి కథనం
Show comments