Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీదేవి మృతి కేసు : అందరి వేళ్లూ బోనీ కపూరే వైపే? ఎందుకని?

అందాల నటి శ్రీదేవి దుబాయ్‌లో చనిపోయారు. ఈ వార్త యావత్ ప్రపంచాన్ని ఒకింత షాక్‌కు గురిచేసింది. అదేసమయంలో ఈ కేసులో ప్రధాన సాక్షి ఆమె భర్తే కావడం ఇపుడు సరికొత్త ట్విస్ట్. అసలు హోటల్ గదిలో శ్రీదేవి చనిపోయే

Advertiesment
శ్రీదేవి మృతి కేసు : అందరి వేళ్లూ బోనీ కపూరే వైపే? ఎందుకని?
, మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (17:10 IST)
అందాల నటి శ్రీదేవి దుబాయ్‌లో చనిపోయారు. ఈ వార్త యావత్ ప్రపంచాన్ని ఒకింత షాక్‌కు గురిచేసింది. అదేసమయంలో ఈ కేసులో ప్రధాన సాక్షి ఆమె భర్తే కావడం ఇపుడు సరికొత్త ట్విస్ట్. అసలు హోటల్ గదిలో శ్రీదేవి చనిపోయే ముందు ఏం జరిగిందన్న దానిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై ఖచ్చితమైన సమాధానం ఇవ్వగలిగినవాడు కూడా బోనీ కపూర్ ఒక్కరే. 
 
అయితే, శ్రీదేవి మృతి కేసులో బోనీ ఇచ్చిన స్టేట్మెంట్ దుబాయ్ పోలీసు అధికారులు రవ్వంత కూడా సంతృప్తి చెందలేదు. ఒకదానికొకటి పొంతనలేని మాటలతో ఆయన మరిన్ని సందేహాలు రేకెత్తించాడు. ఫలితంగా ఆయన్ను ప్రతి ఒక్కరూ అనుమానించేలా చేసుకున్నాడు. ఇప్పటికే బోనీకపూర్ స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు ఆయన వద్ద విచారణ చేసినా ఆశ్చరపడాల్సిన అవసరం లేదు. పాస్ పోర్టు స్వాధీనం చేసుకోవడం, ఆయన కుటుంబ సభ్యులు కూడా దేశం విడిచి వెళ్లొద్దని చెప్పడం చూస్తే బోనీ కపూర్ ఈ కేసులో కార్నర్ అవుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. 
 
ఈ కేసులో సంబంధించి భర్త బోనీ కపూర్ చెబుతున్న కథనంతో కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీదేవిని సర్‌ఫ్రైజ్ చేయడానికి వచ్చానన్న బోనీ తామిద్దరం సుమారు 15 నిమిషాలు మాట్లాడుకున్నాం నవ్వుకున్నామని చెప్పారు. అనంతరం ఓ ఫంక్షన్‌కు వెళ్లాలని రెడీ కావాలని చెప్పగా ఆమె ఫ్రెషప్ అయ్యేందుకు బాత్‌‌రూమ్‌‌కు వెళ్లిందని చాలా సేపటికీ బయటికి రాకపోవడంతో తీవ్ర ఆందోళన చెంది తలుపులు పగులగొట్టగా అపస్మారక స్థితిలో కనిపించిందన్నాడు. దీంతో షాక్‌కు గురై స్నేహితుడికి ఫోన్ చేశాననీ ఆ తర్వాతే హోటల్ యాజమాన్యానికి చెప్పి సమీపంలో ఉన్న రషీద్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించిందని వైద్యులు నిర్దారించారనేది బోనీ చెబుతున్నట్టు తొలుత వచ్చిన కథనం. 
 
నిజానికి స్టార్ హోటల్స్‌లో ఏదేని అనుకోని ఘటనలు జరిగినప్పుడు అత్యవసర సహాయక బృందాలు ఉంటాయి. ఆ బృందాలు అందుబాటులో లేనిపక్షంలో  హోటల్ నిర్వాహకులే వైద్య సహాయం ఇచ్చే ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. తొలుత హోటల్ వాళ్లకు చెప్పకుండా స్నేహితుడికి బోనీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆమె చనిపోయిందని ధృవీకరించుకున్న తర్వాతే స్నేహితుడికి చెప్పారా? అసలు ఈ విషయాన్ని ఎందుకింత ఆలస్యంగా చెప్పాల్సి వచ్చింది? అనేవి బోనీ అంశంలో తలెత్తుతున్న ప్రశ్నలు. 
 
మొదట కుటుంబంతో కలిసి పెళ్లి కోసం దుబాయ్‌ వెళ్లిన బోనీ కపూర్ ఈనెల 22వ తేదీన జరిగిన రిసెప్షన్ తర్వాత స్వదేశానికి (ముంబై) తిరిగొచ్చాడు. ఆ తర్వాత రెండు రోజుల పాటు బయటికి రాకుండా తన పడక గదిలోనే ఒంటరిగా ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. పిమ్మట 24వ తేదీన మళ్లీ ముంబై నుంచి దుబాయ్‌కు వెళ్లాడు. తన భార్య శ్రీదేవిని సర్‌ప్రైజ్ చేయడానికే బోనీ వెళ్లినట్టు చెప్పాడు. నిజంగా ఇందుకే వెళ్లాడా? ఇంకేమైనా కారణాలున్నాయా? అనే అంశంపైనా అనుమానాలు వీడటం లేదు. దీంతో బోనీ, శ్రీదేవి కాల్ డేటాను పరిశీలించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీదేవి కేసు క్లోజ్ : ఎంబాల్మింగ్ సెంటర్‌కు శ్రీదేవి మృతదేహం (వీడియో)