Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు మృతి

Webdunia
గురువారం, 13 జులై 2023 (21:31 IST)
BS Rao
శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు మృతి చెందారు. బాత్రూంలో ప్రమాదవశాత్తు జారిపడి ఆయన ప్రాణాలు కోల్పోయారు. బాత్రూమ్‌లో కాలు జారి పడటంతో ఆయన తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బీఎస్ రావు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 
 
బీఎస్ రావు అంత్యక్రియలు విజయవాడలో నిర్వహించనున్నారు. బీఎస్ రావు కుమార్తె సీమ విదేశాల్లో వున్నారు. ఆమె వచ్చాక అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఇంగ్లండ్, ఇరాన్ వైద్యులుగా సేవలు అందించిన బీఎస్ రావు దంపతులు 1986లో శ్రీ చైతన్య విద్యా సంస్థలను స్థాపించారు. 
 
మొదట విజయవాడలో బాలికల జూనియర్ కళాశాలతో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ఆపై తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, ఎంసెట్‌కు శ్రీ చైతన్య కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. డాక్టర్ బీఎస్ రావు 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూళ్లు, 107 సీబీఎస్ఈ స్కూళ్లు స్థాపించారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో దాదాపు 8 లక్షలకు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

ఆసక్తి రేపుతున్న పౌరుషం - ది మ్యాన్ హుడ్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments