Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ మంచి భర్తను వెతికిపెడితే రూ.4 లక్షల బహుమతి ....

Webdunia
గురువారం, 13 జులై 2023 (21:20 IST)
ఒంటరితనంతో విసిగిపోయిన ఓ అమెరికన్ మహిళ... ఇపుడు భర్త కోసం గాలిస్తుంది. పైగా, తనకు మంచి భర్తను వెతికి పెడితే ఏకంగా 500 డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ.4 లక్షలు) బహుమతిగా ఇస్తానని ప్రకటించింది. ఆమె పేరు ఈవ్ టిల్లీ కౌల్సన్. లాస్ ఏంజిల్స్‌కు చెందిన 35 యేళ్ల ఈమె కార్పొరేట్ లిటిగేషన్ అటార్నీ కావడం గమనార్హం.
 
ఇంతకాలం ఒంటరితనంతో విసిగి వేసారిపోయిన ఈమె... తనకు భర్తకు వెతికి పెట్టమని ఓ ప్రకటన చేసింది. అయితే, మంచి లక్షణాలు ఉన్న పురుషుడు కావాలంటా ఓ షరతు విధించింది. ఈ మేరకు ఆమె టిక్ టాక్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆమెకు ఏకంగా 10 లక్షల మంది ఫాలోయర్లు ఉండటం గమనార్హం. 
 
గతంలో తనకు మంచి భర్తను వెతికిపట్టే పనిని తన స్నేహితులు, తన యజమానికి అప్పగించింది. ఇపుడు ఈ ఆఫర్‌ను ప్రతి ఒక్కరికీ ఇస్తున్నట్టు తెలిపింది. తాను చేసుకోబోయేవాడి లక్షణాలను కూడా వెల్లడించింది. ప్రస్తుతం తాను గత ఐదేళ్లుగా ఒంటరిగా ఉంటున్నాని, డేటింగ్ ప్రయత్నాలతో విసుగు వచ్చిందని, కరోనా తర్వాత డేటింగ్ సంస్కృతిలో మార్పులు వచ్చాయని పేర్కొంది. 
 
అబ్బాయిలు వ్యక్తిగతంగా సంప్రదించడం లేదని, అాగే చాలా మంది బంధాలు విషయంలో సీరియస్‌గా ఉండటం లేదని వాపోయింది. అందుకే మంచి లక్షణాలు ఉన్న పురుషుడి పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పింది. తనకు నచ్చిన వ్యక్తిని వెతికిపెడితే రూ.4 లక్షల నగదు బహుమతి ఇస్తానని ఆమె తన టిక్ టాక్ వీడియోలో పేర్కొంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments