Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిచే పురాణ గ్రంథం మ‌ల్లాది చంద్రశేఖర శాస్త్రి

Webdunia
శనివారం, 15 జనవరి 2022 (16:37 IST)
దివంగత మల్లాది చంద్రశేఖర శాస్త్రి నడిచే పురాణ గ్రంథమని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కొనియాడారు. టీటీడీ కి ఆయన అందించిన సేవలు అమూల్యమని శనివారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. 
 
 
చంద్ర శేఖర శాస్త్రి పురాణ ప్రవచనానికి ఒక స్థాయి కల్పించిన మహానుభావుడని అన్నారు. టీటీడీ పురాణ ప్రబోధ కళాశాలకు ప్రిన్సిపల్ గా పని చేసిన కాలంలో ఎందరో ఉత్తమ ప్రవచన కర్తలను ఆయన తయారు చేశారని చెప్పారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వ్యాఖ్యాన కర్తగా, ధార్మిక ఉపన్యాస కర్తగా స్వామివారి సేవలో తరించారని సుబ్బారెడ్డి తెలిపారు. 
 
 
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ లో ధర్మ సందేహాలు అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు ధర్మ సందేహాలను నివృత్తి చేశారన్నారు. 19 సంవత్సరాల వయస్సు లో పురాణ ప్రవచన ప్రయాణం ప్రారంభించిన మల్లాది చంద్ర శేఖర శాస్త్రి ఆరు దశాబ్దాల పాటు అనేక రూపాల్లో హిందూ ధర్మ ప్రచారాన్ని కొనసాగించారని శ్రీ సుబ్బారెడ్డి నివాళులర్పించారు. చంద్రశేఖర శాస్త్రి ఆత్మకు వేంకటేశ్వర స్వామి వారు శాంతి కలిగించాలని, వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం ప్రసాదించాలని సుబ్బారెడ్డి కోరారు. ఆ కుటుంబానికి టీటీడీ అండగా ఉంటుందన్నారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments