Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి చెక్: అఖిలేశ్ యాదవ్‌కు మద్దతు-యూపీలో కేసీఆర్ ప్రచారం

Webdunia
శనివారం, 15 జనవరి 2022 (16:36 IST)
ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌కు దేశంలోని బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీల నుంచి రాజకీయ, నైతిక మద్దతు లభిస్తోంది. ఇప్పటికే తమ పార్టీతో తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎన్సీపీ యూపీలో పొత్తు కుదుర్చుకున్నాయని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 
 
యూపీలో బీజేపీ తరఫున ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు రంగంలోకి దిగితే అఖిలేశ్‌ ఒంటరిగా ప్రచారం చేయాల్సి వస్తోందని, ఈ నేపథ్యంలో, ఇతర పార్టీల నేతలను రంగంలోకి దింపితే ఎలా ఉంటుందన్న విషయంపై చర్చ జరుగుతోందని ఆ వర్గాలు వివరించాయి. 
 
కాగా, మరో వారం, పది రోజుల్లో తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర సీఎంలు స్టాలిన్‌, కేసీఆర్‌, ఉద్దవ్‌ ఠాక్రే ఢిల్లీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని, శరద్‌ పవార్‌, మమతా బెనర్జీ తదితరులతో కలిసి వారు కార్యాచరణ రూపొందించే అవకాశాలున్నాయని ఈ వర్గాలు తెలిపాయి. 
 
కాగా, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని ఓడించేందుకు ఎస్పీకి మద్దతుగా టీఆర్‌ఎస్‌ అక్కడ ప్రచారం చేసే ఆలోచన ఉందా అని ‘ఆస్క్‌ కేటీఆర్‌’ సందర్భంగా శుక్రవారం ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.
 
ఇలాంటి పరిస్థితుల్లో యూపీలో కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జోరుగా చర్చ సాగుతోంది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు  తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తోందని ఆరోపిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పోరాటంలో కీలక వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్​ యూపీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. యూపీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేయాల్సిందిగా సమాజ్​వాదీ పార్టీ చీఫ్​ అఖిలేష్​ యాదవ్ కూడా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments