Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో ఆ 3 జిల్లాల్లో లాక్డౌన్.. మాస్క్ లేకుంటే క్వారంటైన్‌కే...

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (11:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. ముఖ్యంగా, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో ఈ వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. దీంతో ఈ మూడు జిల్లాల్లో ఆదివారం నుంచి లాక్డౌన్ అమలు చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. 
 
అయితే, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు మాత్రమే కిరాణా సరకుల షాపులు తెరిచివుంచుతారు. అదేసమయంలో కంటైన్మెంట్ జోన్లలో మాత్రం కఠిన ఆంక్షలతో లాక్డౌన్ అమలు చేయనున్నారు.
 
దీనికి కారణం లేకపోలేదు. గత 24 గంటల్లో 465 కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7961కు చేరుకున్నాయి. వీటికి కొత్త కేసులు అదనం. 
 
మరోవైపు, అనంతపురం జిల్లా పోలీసులు లాక్డౌన్ వేళ మరింత కఠినంగా ఉండనున్నారు. మాస్క్ లేకుండా కనిపించిన వారిని క్వారంటైన్‌కు తరలించనున్నట్టు ప్రకటించారు. 
 
జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ కొందరు మాత్రం ఇవేం పట్టించుకోకుండా, యధేచ్చగా లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. అలాగే, సామాజికి భౌతిక దూరాన్ని అస్సలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇలాంటి వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించాలని పోలీసులు నిర్ణయించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments